E-Paper
Advertisement

స్మార్ట్ టీవీ మైక్రోఫోన్ ఆన్‌లో ఉందా? అయితే ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!

స్మార్ట్ టీవీ మైక్రోఫోన్ ఆన్‌లో ఉందా? అయితే ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!
Advertisement

Smart TV privacy settings:  ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఇంటా స్మార్ట్ టీవీలు సాధారణమైపోయాయి. రిమోట్‌తో పని లేకుండా కేవలం మాటలతోనే.. ఛానెల్స్ మార్చడం, యూట్యూబ్ లేదా ఓటీటీ వీడియోలను సెర్చ్ చేయడం వంటి సౌలభ్యాలు టెక్నాలజీని మరింత ఈజీ చేశాయి.అయితే.. ఈ సౌకర్యాల వెనుక మనకు తెలియని కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. టెక్నాలజీ నిపుణుల తాజా హెచ్చరికల ప్రకారం.. మనం ఇంట్లో మాట్లాడుకునే ప్రైవేట్ విషయాలను కూడా స్మార్ట్ టీవీలు వినే అవకాశం ఉందని తేలింది.

మీ టీవీ మాటలు ఎలా వింటోంది?

మనం వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ని వాడకపోయినా..చాలా స్మార్ట్ టీవీల్లోని మైక్రో ఫోన్లు బ్యాక్‌ గ్రౌండ్‌లో నిరంతరం ఆన్‌లోనే ఉంటున్నాయి. మనం చెప్పే “ఓకే గూగూల్” లేదా “అలెక్సా” వంటి వేగ వంతమైన కమాండ్లను గుర్తించడానికి ఈ మైక్రో ఫోన్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పని చేస్తుంటాయి.అంటే..మనం మాట్లాడుకునే ప్రతి చిన్న విషయాన్ని .. లేదా సంభాషణను ఈ డివైజ్‌లు రికార్డు చేసి, సంబంధిత కంపెనీల సర్వర్లకు డేటా రూపంలో.. పంపించే ప్రమాదం ఉంది. దీని వల్ల మన పర్సనల్ విషయాలకు ఇబ్బంది కలగడమే కాకుండా..మన ఆసక్తులకు తగినట్లుగా టార్గెటెడ్ ప్రకటనలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ప్రైవసీ కోసం మీరు చేయాల్సిన మార్పులు :

Advertisement

మీ పర్సనల్ లైఫ్ రహస్యంగా ఉండాలన్నా, సైబర్ దాడుల నుంచి రక్షణ పొందాలన్నా మీ స్మార్ట్ టీవీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు వెంటనే చేయడం చాలా ముఖ్యం.

మైక్రోఫోన్ పర్మిషన్స్ నిలిపివేయడం: మీ స్మార్ట్ టీవీ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, ప్రైవసీ (Privacy) లేదా మైక్రోఫోన్ (Microphone) ఆప్షన్‌ను ఓపెన్ చేయండి. అక్కడ వాయిస్ అసిస్టెంట్ లేదా మైక్రోఫోన్ యాక్సెస్‌ను ‘ఆఫ్’ లేదా ‘డిసేబుల్’చేసుకోవడం బెస్ట్.

Advertisement

ఫిజికల్ మైక్ స్విచ్ : కొన్ని లేటెస్ట్ మోడల్ స్మార్ట్ టీవీల రిమోట్లలో.. లేదా టీవీ బాడీపై ప్రత్యేకంగా మైక్రో ఫోన్‌ను మ్యూట్ చేసే ఫిజికల్ బటన్ ఉంటుంది. మీరు వాయిస్ కమాండ్స్ వాడనప్పుడు దీన్ని మ్యూట్‌లో ఉంచడం ద్వారా సేఫ్ గా ఉండొచ్చు.

అవసరం లేని యాప్స్ పర్మిషన్స్: టీవీలో ఇన్‌ స్టాల్ చేసిన వివిధ థర్డ్-పార్టీ యాప్స్‌కు మైక్రో ఫోన్ లేదా కెమెరా అనుమతులు ఇచ్చి ఉంటే.. వాటిని వెంటనే తొలగించండి. కేవలం నమ్మదగిన యాప్స్‌కు మాత్రమే పర్మిషన్స్.. ఇవ్వడం బెస్ట్.

వాయిస్ రికార్డింగ్స్ డిలీట్ చేయడం: గూగుల్ లేదా ఇతర వాయిస్ అసిస్టెంట్ అకౌంట్స్‌లో.. ఇప్పటివరకు సేవ్ అయిన మీ వాయిస్ హిస్టరీని ఎప్పటికప్పుడు.. టైమ్ టూ టైమ్ డిలీట్ చేసుకోవడం మంచిది. దీని వల్ల మీ డేటా ఎక్కడా దుర్వినియోగం కాకుండా ఉంటుంది.

Also Read: అమెజాన్ సేల్..65 ఇంచుల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు

సేఫ్టీ రూల్స్:

ప్రస్తుత గూగుల్ సెక్యూరిటీ అప్‌డేట్ల ప్రకారం.. స్మార్ట్ హోమ్ డివైజెస్‌లో యూజర్ల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. యూజర్ల తమ డేటాను స్వయంగా నియంత్రించుకునేలా అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. అయినప్పటికీ..డీఫాల్ట్ సెట్టింగ్‌లు కొన్ని సార్లు మన ప్రైవసీని ప్రమాదంలో పడేస్తాయి. అందుకే.. ఎప్పటికప్పుడు మీ టీవీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకుంటూ.. సెట్టింగ్స్‌ను సరి చూసుకోవడం చాలా అవసరం.

స్మార్ట్ టెక్నాలజీ మన జీవితాలను ఎంతో ఈజీ చేసింది నిజమే.. కానీ దాని వల్ల మన పర్సనల మనం గాలికి వది లేయకూడదు. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే.. మీ ఇంటి ప్రైవసీని మీరుఈజీగా కాపాడుకోవచ్చు. ఇప్పుడే.. మీ స్మార్ట్ టీవీ సెట్టింగ్స్‌ని ఓపెన్ చేసి, మైక్రో ఫోన్ ఆన్‌లో ఉంటే వెంటనే మార్చేయండి!

Related News

ChatGPTలో పర్సనల్ చాట్స్ లాకింగ్ ఫీచర్ వచ్చేసింది.. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు!

ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా అవట్లేదా? కొత్త ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

రూ.10 వేలకే కొత్త ఫ్లిప్ ఫోన్.. ఇందులో ఉన్న ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!

శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 ఫోన్లకు అప్‌డేట్స్ ఎప్పటివరకంటే?

చలికాలంలో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే!

భారత్‌లో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ సేల్ షురూ.. స్టోర్‌కి వెళ్తే దొరుకుతుందా? లేక జనవరి దాకా ఆగాలా?

ఏసీలపై నమ్మలేని డిస్కౌంట్లు..ఆఫర్ ముగియక ముందే కొనేయండి

Big Stories

Advertisement
×