E-Paper
Advertisement

Phone Stolen or Lost: ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా రూ.25,000 నష్టపరిహారం.. చిన్న రిఛార్జ్ ప్లాన్‌తో

Phone Stolen or Lost: ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా రూ.25,000 నష్టపరిహారం.. చిన్న రిఛార్జ్ ప్లాన్‌తో
Advertisement

Phone Insurance With Recharge Plan| ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనివారంటూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ ఒకప్పుడు లగ్జరీ కానీ ఇప్పుడు నిత్వాసరంగా మారిపోయింది. అలాంటి నిత్యావసరం ఒకవేళ చోరీ అయినా, లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా స్మార్ట్‌ఫోన్ వేలల్లో ఖరీదు చేస్తుంది. అయితే ఇప్పుడు వినియోగదారులు ఈ నష్టం భరించాల్సిన అవసరం ఉండదు. ఫోన్ దొంగిలించబడినా, లేదా పోగొట్టుకున్నా రూ.25000 వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం చెల్లించాల్సిందేమీ కేవలం ఒక ఫోన్ రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేయాలంతే.

భారత్‌లో మొట్టమొదటిసారి ఒక టెలికాం కంపెనీ రీఛార్జ్‌తో ఫోన్ ఇన్సూరెన్స్ ఆఫర్ ఇస్తోంది. వొడాఫోన్ ఐడియా (Vi) తన ప్రీపెయిడ్ యూజర్లకి ఈ అనూహ్య బెనిఫిట్ లాంచ్ చేసింది. ఫోన్ దొంగతనం లేదా పోగొట్టుకుంటే ఇన్సూరెన్స్ కవర్ దొరుకుతుంది. రీఛార్జ్ చేస్తేనే ఇన్సూరెన్స్ యాక్టివేట్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్.. ఏ ఫోన్ అయినా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

కేవలం రూ.61తో రూ.25,000 ఇన్సూరెన్స్

Advertisement

ఈ ఆఫర్‌లో వొడాఫోన్ అతి పెద్ద హైలైట్ చాలా తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్. రూ.25,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుంది. కేవలం రూ.61 రీఛార్జ్ చేయగానే ఇన్సూరెన్స్ యాక్టివ్ అవుతుంది. ఖరీదైన ఫోన్ ఉన్నవాళ్లకి, ఇన్సూరెన్స్ లేనివాళ్లకి ఈ చిన్న రీఛార్జ్ ప్లాన్ చాలా లాభదాయకం. చాలా తక్కువ ధరలో ఫోన్ పొగొట్టుకున్నవాళ్లకి మనశ్శాంతి దొరుకుతుంది.

ఇన్సూరెన్స్ లభించే ఇతర రీఛార్జ్ ప్లాన్స్‌

వొడాఫోన్ మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌లో ఈ ఫోన్ ఇన్సూరెన్స్ ఇస్తోంది. ప్రతి ప్లాన్‌లో వాలిడిటీ, ఇన్సూరెన్స్ డ్యూరేషన్ భిన్నంగా ఉంటాయి. మీ డేటా అవసరాలు, ఇన్సూరెన్స్ టైమ్ బట్టి ఎంచుకోవచ్చు.

రూ.61 రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్

Advertisement

రూ.61 ప్లాన్‌లో 2GB డేటా + 15 రోజుల వాలిడిటీ ఉంది. రూ.25,000 ఫోన్ ఇన్సూరెన్స్ ఉంది. రీఛార్జ్ చేసిన తర్వాత 30 రోజులు ఇన్సూరెన్స్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆ 30 రోజుల్లో క్లెయిమ్ చేయాలి. షార్ట్ టర్మ్ ప్రొటెక్షన్ కావాలనేవాళ్లకి బెస్ట్. వొడాఫోన్ యాప్, వెబ్‌సైట్‌లో దొరుకుతుంది.

రూ.201 వొడాఫోన్ ప్లాన్ ఏం ఇస్తుంది?

రూ.201 ప్లాన్‌లో 10GB డేటా + 30 రోజుల వాలిడిటీ ఉంది. ఇన్సూరెన్స్ 180 రోజులు (6 నెలలు) యాక్టివ్‌గా ఉంటుంది. రూ.25,000 కవరేజ్. నెలకి సుమారు రూ.34 మాత్రమే ఖర్చు అవుతుంది. లాంగ్ టర్మ్ వాల్యూ కావాలనేవాళ్లకి ఈ ప్లాన్ బెటర్.

రూ.251 వొడాఫోన్ ప్లాన్ ఏం ఇస్తుంది?

రూ.251 ప్లాన్‌లో ఒక సంవత్సరం (365 రోజులు) ఇన్సూరెన్స్ ఉంది. రూ.25,000 కవరేజ్. 10GB డేటా + 30 రోజుల వాలిడిటీ. నెలకి కేవలం రూ.21 ఖర్చు. ఏటా ఫోన్ ప్రొటెక్షన్ కావాలనేవాళ్లకి బెస్ట్.

ఈ ప్లాన్స్ ఎవరికి ఉపయోగం?

ఖరీదైన ఫోన్ ఉన్నవాళ్లకి, ఇన్సూరెన్స్ లేనివాళ్లకి బెస్ట్. సెపరేట్ ఇన్సూరెన్స్ ఖరీదు ఎక్కువ కాబట్టి చాలా మంది కొనుగోలు చేయరు. రీఛార్జ్‌తో ఇన్సూరెన్స్ తోపాటు డేటా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇంత తక్కువ ధరలో ఇది మంచి వాల్యూ ఇచ్చే ఫోన్.

Also Read: నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు, దొంగ యుపిఐ ఐడీలు.. సైబర్ దొంగలను ఇలా గుర్తుపట్టండి

ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

వొడాఫోన్ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ పూర్తిగా డిజిటల్ ప్రాసెస్. పేపర్‌వర్క్ అవసరం లేదు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ త్వరగా జరుగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

రిజిస్ట్రేషన్ రూల్స్ ఏంటి?

ఇన్సూరెన్స్ SMS వచ్చిన 48 గంటల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఫోన్ వాల్యూ సరిగ్గా రిజిస్టర్ అవుతుంది. ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్స్ బట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబుల్ లేకపోతే మీకు రిఫండ్ అయిపోతుంది. మరిన్ని వివరాల కోసం వొడాఫోన్ ఐడియా యాప్ లేదా వెబ్‌సైట్‌లో చెక్ చేయండి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×