E-Paper
Advertisement

Upcoming Renault Cars 2026: 2026లో లాంచ్ కాబోతున్న రెనాల్ట్ కార్లు ఇవే, సరికొత్తగా డస్టర్ రీఎంట్రీ!

Upcoming Renault Cars 2026:  2026లో లాంచ్ కాబోతున్న రెనాల్ట్ కార్లు ఇవే, సరికొత్తగా డస్టర్ రీఎంట్రీ!

Upcoming Renault Cars:  రెనాల్ట్ ప్రస్తుతం దేశీ మార్కెట్ లో క్విడ్, కిగర్, ట్రైబర్‌ అమ్మకాలు కొనసాగిస్తోంది. బడ్జెట్ ధరలో మధ్య తరగతి వినియోగదారులను టార్గెట్ చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కార్లు మంచి సేల్స్ అందుకుంటున్నాయి. ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ 2026 లో రెండు కొత్త SUV లను విడుదల చేయనుంది. వీటిలో ఒకటి డస్టర్. ఇది 2022లో నిలిపివేయబడింది. ఇప్పుడు సరికొత్త అవతార్ లో తిరిగి ఎంట్రీ ఇవ్వబోతోంది. రెండవది కొత్త డస్టర్ ఆధారంగా రూపొందిన 7-సీట్ల SUV. ఇంతకీ వీటి ప్రత్యేకతలు ఏంటంటే..

⦿ రెనాల్ట్ డస్టర్ (Third Generation New Duster)

❂లాంచ్ డేట్:  రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26, 2026న లాంచ్ కానుంది.

❂అంచనా ధర: రూ. 10-12 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్).

❂డిజైన్: రగ్డ్, మోడర్న్ లుక్, Y-షేప్డ్ LED DRLs, పాలిగోనల్ హెడ్‌ ల్యాంప్స్, స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, బోల్డ్ బంపర్స్, డైమండ్-కట్ అల్లాయ్స్.

❂ఇంటీరియర్- ఫీచర్లు: ప్రీమియం ఇంటీరియర్, 10.1-ఇంచ్ టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, వైర్‌ లెస్ చార్జర్, 360° కెమెరా, ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, రెనాల్ట్‌ లో మొదటిసారిగా లెవల్-2 ADAS రాబోతోంది. .

❂ఇంజన్ ఆప్షన్స్: కేవలం పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 1.0L 3-సిలిండర్ టర్బో, 1.3L టర్బో పెట్రోల్ (156 hp), మాన్యువల్, CVT గేర్‌బాక్స్. మైల్డ్ హైబ్రిడ్ ఆప్షన్. స్ట్రాంగ్ హైబ్రిడ్ లేటర్ ను కలిగి ఉంటుంది.

❂ సేఫ్టీ: 6 ఎయిర్‌ బ్యాగ్స్ స్టాండర్డ్, ESC, TPMS, హై NCAP రేటింగ్ అంచనా.

❂పోటీ: ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రాతో పోటీ పడనుంది.

డస్టర్ రెనాల్ట్ ఇండియాలో ఐకానిక్ మోడల్. ఈ కారు మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌ ను మళ్లీ షేక్ చేయనుంది.

Read Also: సత్తా చాటిన సుజుకి విక్టోరిస్.. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్- 2026గా గుర్తింపు!

⦿ రెనాల్ట్ బొరియల్ / బిగ్‌స్టర్ (7 సీటర్ Duster Derivative)

❂ లాంచ్ డేట్: 2026 మిడ్, సెకండ్ హాఫ్ లో విడుదల లాంచ్ కానుంది.

❂ అంచనా ధర: రూ. 15-20 లక్షలు.

❂ డిజైన్: డస్టర్ బేస్డ్ కానీ లాంగర్ బాడీ, ఎక్స్‌ టెండెడ్ వీల్‌బేస్, 7 సీటర్ లే అవుట్. గ్లోబల్‌ లో బిగ్‌స్టర్, బొరియల్ పేరుతో, దేశీ మార్కెట్ లో డస్టర్ బ్యాడ్జింగ్ ఉండవచ్చు.

❂ఇంటీరియర్, ఫీచర్లు: డస్టర్‌తో సిమిలర్  పనోరమిక్ సన్‌ రూఫ్, మల్టిపుల్ సీటింగ్ కాన్ఫిగరేషన్స్, పెద్ద బూట్ స్పేస్.

❂ ఇంజన్: డస్టర్‌తో షేర్ 1.3L టర్బో పెట్రోల్, పాసిబుల్ హైబ్రిడ్.

❂ పోటీ: ఈ కారు హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారీ, MG హెక్టర్ ప్లస్తో పోటీ పడుతుంది.

Read Also: మారుతి సుజుకి విక్టోరిస్ VS టాటా కర్వ్.. ఏది బెస్ట్? ఎందుకు?

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×