E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: వేలు చూపించి మాట్లాడకు.. నామినేషన్ లో దివ్యపై భరణి ఫైర్‌

Bigg Boss 9 Promo: వేలు చూపించి మాట్లాడకు.. నామినేషన్ లో దివ్యపై భరణి ఫైర్‌
Advertisement

Bigg Boss 9 Promo 2: బిగ్‌ బాస్‌ తెలుగు చివరి దశకు చేరుకుంది. చూస్తుండగానే బిగ్‌ బాస్‌ పన్నెండవ వారంలోకి అడుగుపెట్టింది. పదకొండ వారంలో వీకెండ్‌ ఎపిసోడ్‌ ఎపిసోడ్‌ నాగార్జున కంటెస్టెంట్స్‌ తప్పుఒప్పులను తేల్చారు. ఇక సోమవారం కావడంతో యదావిధిగా నామినేషన్స్‌ ప్రక్రియ జరిగింది. నేటి ఎపిసోడ్‌కి సంబంధించి ప్రొమోలను వరుసగా బిగ్‌బాస్‌ టీం రిలీజ్ చేస్తుంది. కాసేపటికి క్రితం రెండో ప్రొమో విడుదల చేశారు. ఇందులో తనూజ-ఇమ్మాన్యుయేల, సుమన్‌ శెట్టి-తనూజ, కళ్యాణ్‌-డిమోన్‌, దివ్య-భరణిల నామినేషన్స్‌ని చూపించారు. వీటిలో దివ్య-భరణిల నామినేషన్‌ వైల్డ్‌ ఫైర్‌ అనిపించింది.

తనూజ-ఇమ్మాన్యుయేల్‌

ఇమ్మాన్యుయేల్‌ కెప్టెన్సీ త్యాగం చేస్తాడని, కెప్టెన్సీ వాల్యూ తెలియదని తనూజ చేసిన కామెంట్స్‌ తనకు నచ్చలేదు అంటూ ఇమ్మూ తనూజని నామినేట్‌ చేశాడు. నువ్వు చేసిందే చెప్పాను కదా అనడంతో నేను చేస్తే నీకేంటి? అన్నాడు. అలా తన మినేషన్స్‌ని తనూజ డిఫెండ్‌ చేసుకుంది. నామినేషన్స్‌ అంటే వాలిడ్‌ పాయింట్స్‌ ఉండాలని, ఇలాంటి సిల్లి సిల్లి పాయింట్స్‌ పెట్టకు అంటూ తనూజ తనని డిఫెండ్‌ చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి గొడవ పీక్‌ స్టేజ్ చేరింది. ఆ తర్వాత సుమన్‌ శెట్టి కూడా తనూజని నామినేట్‌ చేశాడు. గత వారం సుమన్, సంజల మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన దాన్ని కారణంగా చూపించి సుమన్‌ తనూజని నామినేట్‌ చేశాడు. తన వల్లే కెప్టెన్సీ పోయిందని, తను చెప్పినట్టు చేయడం వల్లే టాస్క్‌ ఆడలేకపోయానంటూ సుమన్‌ కారణాలు చెప్పాడు.

Advertisement

గొంతేసుకుని అరవకు.. దివ్యతో భరణి

ఆ తర్వాత భరణి-దివ్యల నామినేషన్‌ చూపించారు. ఇందులో భరణి దివ్యని నామినేట్‌ చేశాడు. మనం ఎంత మంచిగా ఉన్న ఆ వాయిస్‌ అనేది ఆ మంచితనాన్ని కంపెస్తాందంటూ దివ్య అరుస్తుందంటూ భరణి నామినేట్‌ చేశాడు. ప్రతిసారి మీలా అన్ని సాప్ట్‌గా చేయలేనని, ఒక పాయింట్స్‌ తాను మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతాను అని దివ్య అంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదన పెరుగరడంతో దివ్య భరణికి వేలు చూపిస్తూ వాదించింది. అది చూసి భరణికి మండింది. వేలు చూపించకు దివ్య అంటూ భరణి ఆమెపై ఫైర్‌ అయ్యాడు. నెక్ట్స్‌ కళ్యాణ్‌, డిమోన్‌ని నామినేట్‌ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌ నుంచి తీసేస్తే అలా నవ్వుకుంటూ వస్తున్నారేంటి అనడంతో హే నీకేమైన ప్రాబ్లమా అని కళ్యాణ్‌కి చురక అట్టించాడు డిమోన్. అవును.. ప్రాబ్లమేరా? అంటూ డిమోన్‌పై కళ్యాణ్‌ ఫైర్‌ అయ్యాడు.

Advertisement

Also Read: Actor Shivaji: AMB లాంటి మాల్‌లో పాప్‌కార్న్‌ రేట్‌ ఎక్కువ.. ఇండస్ట్రీ ఏం పత్తిత్తు కాదు.. శివాజీ షాకింగ్‌ కామెంట్స్‌

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×