E-Paper
Advertisement

Hyderabad Politics: నువ్వెంత.. నీ బతుకెంత, జాగృతి చీఫ్ కవితపై ఎమ్మెల్యే మాధవరం ఫైర్

Hyderabad Politics: నువ్వెంత.. నీ బతుకెంత, జాగృతి చీఫ్ కవితపై ఎమ్మెల్యే మాధవరం ఫైర్
Advertisement

Hyderabad Politics: జాగృతి చీఫ్ కవిత విషయంలో బీఆర్ఎస్ రూటు మార్చిందా? ఆమెపై ఎదురుదాడి తీవ్రతరం చేయాలని డిసైడ్ అయ్యిందా? ఈ క్రమంలో వారానికి ఒకరు నేత ఆమెపై విరుచుకుపడుతున్నారా? ఈ జాబితాలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్టారావు చేరిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కవితపై ఎమ్మెల్యే మాధవరం ఫైర్

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు జాగృతి చీఫ్ కవిత. అందుకోసం నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్-బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతల మొత్తం జాతకాలు ఆమెకి తెలుసు. అందుకే సమయం, సందర్భం వచ్చినట్టు నియోజకవర్గాల బట్టి రియాక్ట్ అవుతున్నారు.

నేతలు ఎంతెంత అవినీతి చేశారో కళ్లకు విడమరిచి చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ హైకమాండ్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆమె దూకుడు ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారు. దీంతో ఆమెపై ఎటాక్ చేసేందుకు ఓ టీమ్‌ని రెడీ చేసినట్టు తెలుస్తోంది.  జిల్లాకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఆ పార్టీ నేతలు రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

కేసీఆర్, కేటీఆర్‌లను నాశనం చేసే ప్రయత్నం-ఎమ్మెల్యే

తాజాగా కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో తిరగడానికి కవితకు అసలేం హక్కు ఉందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌లను నాశనం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మర్యాదతో చెబుతున్నానని, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా మాట్లాడాలంటూ హెచ్చరించారు.

కవిత మంచిది కాదు కాబట్టే పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. పదేళ్లు అధికారం అనుభవించనప్పుడు ఎందుకు బీసీలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు? ఢిల్లీలో మంచి పేరు ఉన్న మాజీ సీఎం కేజ్రీవాల్‌ని ఆగం చేసిందెవరంటూ సూటిగా ప్రశ్న లేవనెత్తారు. కోట్లుకు కోట్లు సంపాదించిందెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: తెలంగాణ ప్రజలకు మంచిరోజు.. పార్టీ మాటిచ్చింది, ఆపై నిలబెట్టుకుంది

ఇప్పుడున్న రాజకీయ నేతలకు లేని ఇల్లు హైదరాబాద్‌లో మీకు లేదా? హరీష్‌రావు మీద ఎందుకు దాడి చేస్తున్నావన్నది ఆయన వెర్షన్. తొలుత జగదీష్‌రెడ్డి, ఆ తర్వాత నిరంజన్‌రెడ్డి, ఇప్పుడు మాధవరం కృష్ణారెడ్డి వంతైంది. ఈ లెక్కన రానున్న రోజుల్లో కవితపై ఎదురుదాడి తీవ్రతరం ఖాయమనే వాదన ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది.

 

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×