E-Paper
Advertisement

Poco F7 India Launch: 7,550mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్.. ఇండియాలో పోకో F7 లాంచ్

Poco F7 India Launch: 7,550mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్.. ఇండియాలో పోకో F7 లాంచ్

Poco F7 India Launch| గేమింగ్ ఫోన్లకు ఫేమస్ అయిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో కొత్తగా మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియుల కోసం పోకో భారతదేశంలో కొత్తగా పోకో ఎఫ్7 5జీని విడుదల చేసింది. ఈ ఫోన్ భారీ 7,550 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది పోకో బ్రాండ్‌లో ఇప్పటివరకు అతిపెద్ద బ్యాటరీ. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పవర్ ఫల్ గా లాంచ్ అయిన ఈ ఫోన్, గేమింగ్ తో పాటు శక్తివంతమైన పనితీరు కోసం రూపొందించబడింది. గత సంవత్సరం విడుదలైన పోకో ఎఫ్6 5జీ ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్.. చైనాలో రెడ్‌మీ టర్బో 4 పేరుతో విడుదలైన మోడల్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించబడింది. భారత్‌లో పోకో ఎఫ్7 సాధారణ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రో వెర్షన్.. గ్లోబల్ మార్కెట్‌లలో విడుదలైంది.

పోకో ఎఫ్7 5జీ ధర

భారత్‌లో పోకో ఎఫ్7 ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 31,999 నుండి ప్రారంభమవుతుంది. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999. ఈ ఫోన్.. జూలై 1 నుండి ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది.

పోకో ఎఫ్7 5జీ లక్షణాలు

పోకో ఎఫ్7 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉంది. దీని స్క్రీన్ 3,200 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్ నెస్‌తో, HDR10+ సపోర్ట్‌తో అద్భుతమైన వ్యూఇంగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. తడి వేళ్లతో టచ్ చేసినా కూడా స్క్రీన్ పనిచేసే వెట్ టచ్ డిస్‌ప్లే టెక్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది పాస్‌కీలను సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో అత్యధునికంగా ఉంది. ఇది iQOO నియో 10లో ఉపయోగించిన చిప్‌సెట్‌తో సమానం. 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్‌తో, ఈ ఫోన్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కెమెరా విషయానికొస్తే, ఇందులో 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది, ఇది వీడియో కాల్స్, సెల్ఫీలకు ఉపయోగపడుతుంది.

పోకో ఎఫ్7 ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2.0 ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌లతో వాటర్, డస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఎలాంటి కఠిన వాతావరణంలో కూడా ఇది పనితీరుపై ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది.

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వివరలు

పోకో ఎఫ్7లోని 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ రోజుల్లో ఫోన్‌లలో అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, దీనితో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. అలాగే, 22.5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది, దీనితో మీరు ఇతర పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫీచర్ అత్యవసర సమయాల్లో ఫోన్‌ను పవర్‌బ్యాంక్‌లా ఉపయోగించేలా చేస్తుంది.

Also Read: గూగుల్ ఎఐ, చాట్‌జిపిటీలు బ్లాక్ మెయిల్ చేయగలవు.. చాట్‌బాట్లతో ప్రమాదం

డిజైన్, ఇతర ఫీచర్లు

పోకో ఎఫ్7 సొగసైన డిజైన్‌తో, అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. ఇది సైబర్ సిల్వర్ ఎడిషన్, ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గేమర్స్, పవర్ యూజర్లకు అనువైన ఆప్షన్‌గా నిలుస్తుంది, దీని ధర,  ఫీచర్స్ పోలి చూస్తే.. కొత్త ఫోన్ తీసుకోవాలనే వారికి ఇది అద్భుమైన ఆప్షన్.

Related News

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Big Stories

×