E-Paper
Advertisement

Poco X8 Pro: 9000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో పోకో కొత్త ఫోన్స్ లాంచ్.. పవర్‌ఫుల్ కెమెరాతో ధర ఎంతంటే

Poco X8 Pro: 9000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో పోకో కొత్త ఫోన్స్ లాంచ్.. పవర్‌ఫుల్ కెమెరాతో ధర ఎంతంటే
Advertisement

Poco X8 Pro| పోకో ఫోన్లు ఇష్టపడే వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పోకో X8 ప్రో 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్ భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి. పోకో X8 ప్రో 5G, పోకో X8 ప్రో మ్యాక్స్ 5G, పోకో X8 ప్రో ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఉన్నాయి.

మార్వెల్ ఫ్యాన్స్‌ కోసమే ఐరన్ మ్యాన్ ఎడిషన్ స్పెషల్ డిజైన్‌తో వచ్చింది. ఈ ఫోన్లలలో ప్రధానంగా ప్రత్యేక పెర్ఫామెన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ ఫీచర్లుతో వచ్చాయి. మార్చి 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలవుతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. SBI, ICICI, HDFC కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు అదనపు డిస్కౌంట్ ఉంది.

ధర, వేరియంట్ల వివరాలు

Advertisement

పోకో X8 ప్రో Pro 5G బేస్ వేరియంట్ (8GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.32,999. హైయర్ వేరియంట్ (12GB ర్యామ్) రూ.35,999కి లభిస్తుంది.
పోకో X8 ప్రో మ్యాక్స్ 5G (12GB ర్యామ్ + 256GB) రూ.42,999 నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ (512GB స్టోరేజ్) రూ.46,999.
పోకో X8 ప్రో ఐరన్ మ్యాన్ ఎడిషన్ (12GB ర్యామ్ + 256GB) ధర రూ.34,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు బ్లాక్, వైట్, గ్రీన్, బ్లూ కలర్లలో వస్తాయి. డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

ఈ సిరీస్‌లో అతి పెద్ద హైలైట్ బ్యాటరీ. ప్రో మ్యాక్స్ మోడల్‌లో 9,000mAh భారీ బ్యాటరీ ఉంది. ఒక్క ఛార్జ్‌తో మూడు రోజుల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. సాధారణ ప్రో మోడల్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. రెండూ 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. 27W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇతర డివైస్‌లను ఈ ఫోన్‌తో ఛార్జ్ చేయవచ్చు.

డిస్‌ప్లే, పర్‌ఫామెన్స్

Advertisement

ప్రో మ్యాక్స్ మోడల్‌లో 6.83 ఇంచ్ 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 3,500 nits వరకు ఉంది. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రో మ్యాక్స్‌లో 3nm మిడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు టాప్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. ప్రో మోడల్‌లో 4nm డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్ ఉంది. రెండు ఫోన్లలో 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఎక్కువ సేపు గేమ్ ఆడినా ఫోన్ వేడెక్కదు. IP68, IP69 రేటింగ్స్‌తో దుమ్ము, నీరు నుంచి పూర్తి రక్షణ ఉంది.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

కెమెరా, సాఫ్ట్‌వేర్

ఫోన్ వెనక భాగంలో డ్యూయల్ కెమెరా ఉంది. మెయిన్ 50MP సెన్సార్ OIS సపోర్ట్‌తో స్పష్ట ఫోటోలు తీస్తుంది. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ వైడ్ షాట్స్‌కు బాగుంది. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లు HyperOS 3తో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రన్ అవుతాయి. స్మూత్‌గా, ఆధునిక ఫీచర్లతో పనిచేస్తాయి.

పోకో X8 Pro సిరీస్ బలమైన ఫీచర్లతో వచ్చింది. పవర్‌ఫుల్ పర్‌ఫామెన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. స్టైలిష్ లుక్, గొప్ప స్పెసిఫికేషన్లు కావాలనుకునే వాళ్లకు ఇది చాలా మంచి ఆప్షన్.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×