E-Paper
Advertisement

Smartphone Comparison: పోకో X8 ప్రో vs వివో V60e vs వన్‌ప్లస్ నార్డ్ 5.. ఏది కొనుగోలు చేయాలి?

Smartphone Comparison: పోకో X8 ప్రో vs వివో V60e vs వన్‌ప్లస్ నార్డ్ 5.. ఏది కొనుగోలు చేయాలి?
Advertisement

Poco X8 Pro vs Vivo V60e vs OnePlus Nord 5 Smartphone Comparison| పోకో ఇటీవల భారత్‌లో పోకో X8 ప్రో స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఫోన్‌కు వివో V60e, వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్స్ గట్టి పోటీ ఇస్తున్నాయి. మూడు ఫోన్లు దాదాపు ఒకే ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు ఇస్తున్నాయి. మీ అవసరాలు, ప్రాధాన్యాలను బట్టి సరైన ఫోన్ ఎంచుకోవాలి.

ధరలు, స్టోరేజ్ వేరియంట్లు

పోకో X8 ప్రోలో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ రూ.32,999కు లభిస్తుంది. 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.35,999కు లభిస్తుంది.
వివో V60eలో 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.31,999కు, 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.33,999కు లభిస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ 5లో 8GB ర్యామ్ + 256GB రూ.33,999కు, 12GB ర్యామ్ + 256GB రూ.36,999కు లభిస్తాయి.

డిస్‌ప్లే, రిజల్యూషన్

Advertisement

పోకో X8 ప్రోలో 6.59 ఇంచుల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
వివో V60eలో 6.77 ఇంచుల కర్వ్డ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83 ఇంచుల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. Full HD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

ఆపరేటింగ్ సిస్టమ్

పోకో X8 ప్రో ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో నడుస్తుంది.
వివో V60e ఆండ్రాయిడ్ 15తో FuntouchOS 15తో నడుస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ 5 ఆండ్రాయిడ్ 15తో OxygenOS 15తో నడుస్తుంది.

ప్రాసెసర్ పర్‌ఫామెన్స్

Advertisement

పోకో X8 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్‌కు చాలా బాగా పని చేస్తుంది.
వివో V60eలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు సులభంగా చేస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ 5లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ పనితీరు ఇస్తుంది.

కెమెరా సెటప్

పోకో X8 ప్రోలో 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి.
వివో V60eలో 200MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది కెమెరా ప్రియులకు బాగుంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ 5లో కూడా 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీ కెమెరాలో పోకో 20MP, వివో మరియు వన్‌ప్లస్ రెండింటికీ 50MP సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్

పోకో X8 ప్రోలో 6500mAh బ్యాటరీ ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వివో V60eలో 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 5లో 6800mAh బ్యాటరీ, 80W SuperVOOC ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి.

Also Read: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే

ఏది కొనుగోలు చేయాలి?

పోకో X8 ప్రో బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్, బలమైన బ్యాటరీ ఇస్తుంది.
వివో V60e హై క్వాలిటీ కెమెరా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 5 ఫ్లాగ్‌షిప్ లెవల్ ప్రాసెసర్‌తో బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది.
వాల్యూ కావాలంటే పోకో, కెమెరా కావాలంటే వివో, పనితీరు కావాలంటే వన్‌ప్లస్ ఎంచుకోండి.
మీ బడ్జెట్, ఇతర ఫీచర్ల ప్రాధాన్యతల ఆధారంగా నిర్ణయం తీసుకోండి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన మూడు కొత్త స్మార్ట్‌ఫోన్స్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీలు, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసే సమయంలో బాగా చెక్ చేసుకొని కొనాలని వినియోగదారులకు సూచన. ఈ కథనంలో పేర్కొన్న ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×