E-Paper
Advertisement

Priyanka Chopra: మేము విడాకులు తీసుకోవాలని కోరుకున్నారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన గ్లోబల్ స్టార్!

Priyanka Chopra: మేము విడాకులు తీసుకోవాలని కోరుకున్నారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన గ్లోబల్ స్టార్!
Advertisement

Priyanka Chopra:మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. బాలీవుడ్లో కెరియర్ పీక్స్ లో ఉండగానే సడన్గా అవకాశాలు తగ్గిపోవడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయిన ప్రియాంక చోప్రా.. దాదాపు 8 ఏళ్లపాటు కష్టపడి ఊహించని ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నేడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో ప్రజెంటర్ గా రెండుసార్లు కనిపించి.. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఆస్కార్ వేడుకపై ఏకంగా రెండుసార్లు ప్రజెంటర్ గా పనిచేసిన నటిగా చరిత్ర సృష్టించింది ప్రియాంక చోప్రా.

విడాకుల రూమర్లపై మళ్ళీ స్పందించిన ప్రియాంక చోప్రా..

అలాంటి ఈమె ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఇందులో మందాకిని అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అప్పుడే రాజమౌళి కూడా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు. ఇక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా.. గత నాలుగేళ్లుగా విడాకులు తీసుకోబోతోంది అంటూ వస్తున్న రూమర్లకి గతంలోనే స్పందించి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయినా సరే రూమర్లు ఆగకపోవడంతో మరొకసారి స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

మేము విడిపోవాలని కోరుకుంటున్నారా?

Advertisement

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “నేను సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫోటో పెడితే చాలు ఏవేవో ఊహించుకుంటూ కొంతమంది అదే పనిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను నిక్ జోనస్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మేమిద్దరం జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తున్నాము. బయటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వము. అయితే మేము విడాకులు తీసుకుంటున్నాం అంటూ కొన్ని కథనాలు వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. మా వివాహ బంధం ముగిసిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము వేర్వేరు దేశాలకు చెందినవారిమి మాత్రమే కాదు వేర్వేరు మతాలకు కూడా చెందిన వాళ్ళం.. పైగా మా ఇద్దరి మధ్య వయసు తేడా కూడా ఉంది. ఇలా కొన్ని కారణాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.

ALSO READ:Peddi Movie: నెల ముందే ఓవర్సీస్ లో పెద్ది అడ్వాన్స్ బుకింగ్.. ఒక్కో టికెట్టు ధర ఎంత అంటే?

ఎన్ని పుకార్లు వచ్చినా మేం విడిపోం..

Advertisement

కానీ ఎనిమిదేళ్లుగా మేము మా వైవాహిక బంధంలో చాలా సంతోషంగా ఉన్నాము. నిక్ జోనస్ పరిచయమైన తర్వాత ఆరు నెలలకే మేము వివాహం చేసుకున్నాము. మా గురించి ఎవరు ఏమనుకున్నా మేము పట్టించుకోము. ఎప్పటికీ మేము కలిసే ఉంటాము. పుకార్లు మాత్రం నమ్మకండి” అంటూ రూమర్స్ కి చెక్ పెట్టింది ప్రియాంక చోప్రా. మొత్తానికి అయితే ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×