E-Paper
Advertisement

Robot malfunction: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే

Robot malfunction: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే
Advertisement

Robot malfunction| టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యేకొద్ది మనుషులు శారీరక శ్రమ తగ్గించుకునేందుకు కంప్యూటర్లు, మెషీన్లపై ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాక్టరీలు, ఇళ్లు, హోటళ్లు, షాపుల్లో రోబోలను హెల్పర్లుగా, వర్కర్లుగా ఉపయోగిస్తున్నారు. కంపెనీలు మనుషుల స్థానంలో రోబోలతో పనిచేయిస్తున్నాయి. రోబోలు పని త్వరగా, సులభంగా చేస్తాయి. కానీ కొన్నిసార్లు రోబోలు అదుపుతప్పిన సందర్భాలున్నాయి. అలాంటి సమయంలో చాలా నష్టం కలిగిస్తాయి. ఇటీవల ఒక రెస్టారెంట్‌లో హ్యూమనాయిడ్ (మనిషి ఆకారంలో ఉండే) రోబో ఓనర్, కస్టమర్లను ఒక ఆట ఆడుకుంది.

అదుపు తప్పిన రోబో

ఇటీవల వైరల్ అయిన వీడియోలో ఒక రోబో అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. అకస్మాత్తుగా అదుపు తప్పి చుట్టపక్కలంతా గందరగోళం సృష్టించింది. టేబుల్ మీద ఉన్న స్పూన్లు, చాకులు, ప్లేట్లు విసిరేసింది. చాప్‌స్టిక్స్ గాల్లోకి ఎగరవేసింది. వీడియోలో ఆ రోబో ఆరెంజ్ ఏప్రాన్ ధరించినట్లుగా కనిపిస్తోంది. దానిపై “I’m GOOD” అని రాసి ఉంది. ముఖంపై LED స్మైల్ కనిపిస్తోంది. అంటే ఆ రోబో రెస్టారెంట్లో సర్వర్‌గా పనిచేస్తోంది.

రెస్టారెంట్‌లో గందరగోళం

Advertisement

రోబో చుట్టూ ఉన్న వస్తువులను కిందపడేసి విరగొట్టింది. నేలమీద అంతా ప్లేట్లు, గిన్నెలు విరిగిపడి అందులో ఆహారమంతా చెత్తగా అయింది. తర్వాత ఒక టేబుల్‌ను పగలగొట్టింది. ఆ తర్వాత ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. కస్టమర్లు, సిబ్బంది అందరూ గందరగోళంలో పడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.

ఇదంతా ఎక్కడ జరిగింది
ఈ ఘటన అమెరికాలోని సాన్ జోస్, కుపర్టినో ప్రాంతంలోని హైదిలావో హాట్‌పాట్ రెస్టారెంట్‌లో జరిగింది. అక్కడ సర్వర్‌గా పనిచేసే రోబో.. ప్రమోషనల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేయాల్సి ఉంది. కస్టమర్లను ఆకర్షించడానికే ఓనర్లు ఇదంతా ఏర్పాటు చేశారు. కానీ అదుపు తప్పి గందరగోళం సృష్టించింది.

రోబోను ఆపడానికి అష్టకష్టాలు

Advertisement

రోబో చేసే గందరగోళం చూసి రెస్టారెంట్ సిబ్బంది త్వరగా స్పందించారు. జాగ్రత్తగా రోబో దగ్గరకు వెళ్లారు. ఒకరు రోబో మెడను పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. మరొకరు మొబైల్ యాప్‌తో కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. రోబో చేతులు కంట్రోల్ లేకుండా ఊగుతూనే ఉన్నాయి. ముగ్గురు సిబ్బంది కలిసి కష్టపడి రోబోను ఆపగలిగారు.

రోబోల భద్రతపై ఆందోళన

ఈ ఘటన పబ్లిక్ ప్లేస్‌లలో రోబో భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తింది. రోబో మాల్‌ఫంక్షన్ అయితే ప్రమాదం జరగవచ్చు. కంపెనీలు ముందుగా బాగా టెస్ట్ చేయాలి. భద్రతా చర్యలు తీసుకోవాలి. క్రౌడెడ్ ఏరియాల్లో మనుషుల సూపర్‌విజన్ చాలా ముఖ్యం.

Also Read: ఇక కోడింగ్ ఉద్యోగాలకు మనుషులు అవసరం లేదు.. ఏఐ చేసేస్తుంది.. శాం ఆల్ట్‌మ్యాన్ షాకింగ్ వ్యాఖ్యలు

పెరుగుతున్న హ్యూమనాయిడ్ రోబోల వినియోగం

రెస్టారెంట్లు, రిటైల్ షాపుల్లో హ్యూమనాయిడ్ రోబోలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించడానికి, యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు రోబోలు ఇంకా పర్ఫెక్ట్ కావడం లేదని చూపిస్తున్నాయి.

ఈ రోబో ఘటన పని ప్రదేశాల్లో ఆటోమేషన్ లాభాలు, రిస్క్‌లు రెండూ చూపిస్తుంది. రోబోలు పని సులభం చేస్తాయి కానీ కఠినమైన కంట్రోల్ అవసరం. బిజినెస్‌లు భద్రత, మానిటరింగ్‌పై దృష్టి పెట్టాలి. టెక్నాలజీ మనుషులకు సహాయకరంగా ఉండాలి, సమస్యలు సృష్టించకూడదు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×