Gray pumpkin: మీ ఇంట్లో గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడుతున్నారా..? అయితే ఇలా కడితే మీకు అష్టైశ్వర్యాలకు లోటుండదట. గుమ్మానికి కట్టే ముందు బూడిద గుమ్మడికాయను శాస్త్రం ప్రకారం కట్టాలని పండితులు సూచిస్తున్నారు. అలా కాకుండా ఇష్టమొచ్చినట్టు కడితే మీకు వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శాస్త్రంలో చెప్పిన విధంగా బూడిద గుమ్మడి కాయ కట్టడం వల్ల ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయట.
ఇంట్లో గుమ్మానికి బూడిద గుమ్మడి కాయ కట్టాలని అనుకుంటే ముందుగా మార్కెట్ నుంచి గుమ్మడి కాయను తెచ్చినప్పుడు దానికి పైన ఉన్న బూడిదను ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేయకూడదట. అలాగే బూడిద గుమ్మడి కాయను కట్టే ముందు పసుపు పూయాలని పండితులు సూచిస్తున్నారు. పసుపు పూసిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టాలట. అవి రెండు పెట్టిన పసుపు, కుంకుమ ఆరిపోయే వరకు గుమ్మడి కాయను పక్కన పెట్టుకోవాలట.
ఇంట్లో గుమ్మానికి బూడిద గుమ్మడి కాయ కట్టడానిక అతి ఉత్తమమైన రోజు అమావాస్య అని చెప్తున్నారు పండితులు. ఇంకా ఆదివారం అమావాస్య కలిసి వస్తే చాలా చాలా మంచిదని సూచిస్తున్నారు. అమావాస్య రోజు కానీ ఆదివారం అమావాస్య రోజు కానీ సూర్యోదయానికి ముందే సిద్ద చేసుకున్న బూడిద గుమ్మడికాయను కట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో అత్యుత్తమైన మంచి ఫలితాలు ఉంటాయట.
ఇంట్లో గుమ్మానికి బూడిద గుమ్మడి కాయను అమావాస్య రోజు కానీ ఆదివారం అమావాస్య రోజు కానీ కట్టలేనివారు.. బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ కట్టుకోవచ్చని సూచిస్తున్నారు పండితులు. ఈ రెండు రోజుల్లో కూడా సూర్యోదయానికి ముందే రెడీగా ఉంచుకున్న బూడిద గుమ్మడి కాయ కట్టడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయట.
గుమ్మానికి బూడిద గుమ్మడి కాయను అమావాస్య, ఆదివారం అమావాస్య, బుధవారం, శనివారం కాకుండా ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం రోజులలో కట్టకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ అయిదు రోజులలో అమావాస్య వస్తే మాత్రం కట్టుకోవచ్చట. ఇక సూర్యోదయం అయిన తర్వాత కడితే ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయట. ఇక సూర్యాస్తమయం తర్వాత కడితే అసలు ఫలితాలే రావట. కొన్ని సందర్భాల్లో నెగెటివ్ రిజల్ట్ రావొచ్చని హెచ్చరిస్తున్నారు పండితులు.
గుమ్మానికి కట్టిన బూడిద గుమ్మడి కాయను తీసివేయడానికి ఎటువంటి ముహూర్తాలు లేవట. అయితే గుమ్మడి కాయ కట్టిన తర్వాత ఎప్పుడైనా ఆ బూడిద గుమ్మడి కాయ నుంచి నీరు కారడం మొదలు పెడితే వెంటనే తీసేయాలట. అలాగే గుమ్మడికాయ ఎండిపోయినా లేదా తేలికగా అయిపోయినా.. వెంటనే గుమ్మడి కాయను తీసేయాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.