E-Paper
Advertisement

Trump vs Kim: కిమ్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. అణు యుద్ధం తప్పదా?

Trump vs Kim: కిమ్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. అణు యుద్ధం తప్పదా?
Advertisement

Trump vs Kim: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిరూపించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. వెనిజులా అధ్యక్షుడి కిడ్నాప్, గ్రీన్ ల్యాండ్ హస్తగతానికి ప్రయత్నాలు, రీసెంట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య.. ట్రంప్ ఆలోచన విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం ముగిసిన వెంటనే.. ట్రంప్ ఫోకస్ ఉత్తర కొరియాపైకి వెళ్లనున్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ కిమ్ జోంగ్ ఉన్ అయ్యే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

‘కిమ్‌కు ఆ గతి పట్టొచ్చు’

ది యూరో ఏషియన్ టైమ్స్ నివేదిక (The EurAsian Times Report) ప్రకారం.. అమెరికా గత కొంతకాలంగా తనకు చెక్ పెట్టే దేశాలను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోనూ ఎత్తుకెళ్లింది. అలాగే ఎంతో కాలంగా సవాలుగా నిలుస్తున్న అలీ ఖమేనీని సైతం ఇజ్రాయెల్ తో కలిసి రీసెంట్ గా మట్టుబెట్టింది. ఈ క్రమంలోనే తనకు కొరకరాని కొయ్యలా ఉంటోన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పై కూడా ట్రంప్ ఫోకస్ పెట్టినట్లు సదరు వార్త సంస్థ పేర్కొంది. త్వరలోనే కిమ్ కు చెక్ పెట్టే యోచనలో ట్రంప్ ఉన్నట్లు రాసుకొచ్చింది.

చరిత్ర ఏం చెబుతోంది..

Advertisement

దేశాధినేతలను అణిచివేసిన చరిత్ర అమెరికాకు ఉంది. తనను ఇబ్బందులకు గురిచేసిన హిట్లర్, గడాఫి, సద్దాం హుస్సేన్ వంటి వారిపై అమెరికా బలగాలు ఉక్కుపాదం మోపాయి. అయితే ఆ తర్వాత నుంచి అమెరికా వైఖరి మారుతూ వచ్చింది. ఆంక్షల పేరుతో మాత్రమే తన ప్రత్యర్థి దేశాలకు అమెరికా చెక్ పెడుతూ వచ్చింది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూఎస్ వైఖరిలో మార్పు వచ్చింది. అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటూ మిత్ర దేశాలను సైతం ట్రంప్ వదలడం లేదు. ప్రస్తుతం ట్రంప్ నేతృత్వంలోని అమెరికా దూకుడు చూస్తుంటే ఉత్తర కొరియాపై సైతం సైనిక చర్యలు తీసుకుంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Kalvakuntla Kavitha: ‘ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు తగులుతుంది’.. కవిత శాపనార్థాలు!

అణు యుద్ధం తప్పదా?

Advertisement

వెనిజులా, ఇరాన్ తో పోలిస్తే ఉత్తర కొరియా చాలా బలమైన దేశంగా ఉంది. ఎందుకుంటే ప్రపంచంలోని అణ్వాయుధాలు కలిగిన 9 దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏమాత్రం దుందుడుకుగా వ్యవహరించినా.. అది అణు యుద్ధానికి దారితీయవచ్చని రక్షణశాఖ నిపుణులు చెబుతున్నారు. పైగా కిమ్ జోంగ్ ఉన్ సైతం ట్రంప్ తరహాలోనే చాలా దూకుడు స్వభావం కలిగిన వ్యక్తిగా పేరుంది. నిరంతరం ఏదోక క్షిపణి ప్రయోగం చేస్తూ.. తన ఆయుధ సామర్థ్యాన్ని కిమ్ ఎంతగానో పెంచుకుంటున్నారు. కాబట్టి ట్రంప్ అనాలోచితంగా వ్యవహిరిస్తే.. అది అమెరికాకే నష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఉత్తర కొరియా.. చైనా, రష్యాకు మంచి మిత్ర దేశం కావడంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ట్రంప్ ఉత్తర కొరియా విషయంలో ఏ విధంగా నడుచుకుంటారో చూడాలి.

Also Read: YS Sharmila: కల్తీ పాల ఘటన.. ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే.. వైఎస్ షర్మిల ఫైర్

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×