E-Paper
Advertisement

GAIL Recruitment 2026: నెలకు రూ.93,000 జీతం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

GAIL Recruitment 2026: నెలకు రూ.93,000 జీతం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
Advertisement

ప్రభుత్వ రంగ దిగ్గజం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) భారీ జీతంతో కూడిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వైద్య రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

ఉత్తరప్రదేశ్‌లోని పట్నా ప్రాంతంలో ఉన్న గెయిల్ యూనిట్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులోగా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 మెడికల్ ఆఫీసర్ పోస్టులను గెయిల్ భర్తీ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత కాలం పాటు గెయిల్ సంస్థలో సేవలు అందించాల్సి ఉంటుంది.

Advertisement

అభ్యర్థుల పనితీరు అవసరాల ప్రాతిపదికన ఈ ఒప్పంద కాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. వైద్య సేవలు అందించడంలో ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:  అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా మెడికల్ కౌన్సిల్ నుంచి ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో కనీస ఉద్యోగానుభవం కలిగి ఉండటం తప్పనిసరి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత లభిస్తుంది. నిబంధనల ప్రకారం అభ్యర్థులకు ఉండాల్సిన వయోపరిమితి ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్ లో తనిఖీ చేసుకోవచ్చు.

Advertisement

జీతం: ఎంపికైన మెడికల్ ఆఫీసర్లకు నెలకు రూ. 93,000 వరకు గౌరవ వేతనం చెల్లిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తూ మంచి జీతం పొందాలనుకునే డాక్టర్లకు ఇది మంచి అవకాశం. జీతంతో పాటు సంస్థ నిబంధనల మేరకు ఇతర సౌకర్యాలు లభించే అవకాశం ఉంది.

ఉద్యోగ ఎంపిక విధానం: సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా పారదర్శకంగా సాగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్స్ పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రదర్శించిన ప్రతిభ అభ్యర్థి అకడమిక్ రికార్డుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును ఈమెయిల్ ద్వారా పంపాలి. అభ్యర్థులు తమ బయోడేటా విద్యార్హత పత్రాలను recruitment.pata@gail.co.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.

చివరి తేది: దరఖాస్తులు పంపడానికి ఏప్రిల్ 7వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) గెయిల్ (ఇండియా) లిమిటెడ్ పట్నా జిల్లా ఉత్తర్‌ప్రదేశ్‌ పిన్ కోడ్ – 206241 చిరునామాలో సంప్రదించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం గెయిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవాలి.

ALSO READ: RRB ALP Notification: నిరుద్యోగులకు రైల్వే భారీ గుడ్ న్యూస్.. 11,127 పోస్టులతో ALP నోటిఫికేషన్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×