E-Paper
Advertisement

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి
Advertisement

USB Type C port damage reasons: ప్రస్తుత కాలంలో అన్ని స్మార్ట్‌ ఫోన్‌లకు ‘యూఎస్‌బి టైప్-సి’ పోర్ట్ కామన్ అయిపోయింది. వేగంగా.. ఛార్జింగ్ చేసుకోవడానికి, డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది. కానీ చాలా మంది కస్టమర్లు చేసే.. కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఈ పోర్ట్ త్వరగా పాడై పోతుంటుంది. ఫలితంగా.. ఫోన్ ఛార్జ్ ఎక్కకపోవడం, లూజ్ కనెక్షన్ ఏర్పడటం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి టైంలో సర్వీసింగ్ సెంటర్ల చుట్టూ తిరగకుండా, మీ ఫోన్ టైప్-సి పోర్ట్‌ను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఫోన్ టైప్-సి పోర్ట్‌ను దెబ్బతీసే పొరపాట్లు!

కేబుల్ వాడకం :

టైప్-సి పోర్ట్ రివర్సిబుల్ అయినప్పటికీ, కొంత మంది తొందర పాటులో తప్పుడు కోణంలో.. లేదా విపరీతమైన బలంతో కేబుల్‌ను లోపలికి తోస్తుంటారు. దీని వల్ల పోర్ట్ లోపల ఉండే సూక్ష్మమైన పిన్స్ వంగి పోవడం లేదా విరిగి పోవడం జరుగుతుంది. ఒక సారి పిన్స్ దెబ్బతింటే టెక్నీషియన్‌ దగ్గరకు వెళ్లి పోర్ట్ మార్చాల్సి వస్తుంది. దీనికి మోడల్‌ను బట్టి సుమారు రూ. 500 నుంచి రూ. 1,500 వరకు ఖర్చు అవుతుంది.

పోర్ట్ ఓపెన్‌గా ఉండటం:

Advertisement

చాలా మంది ఫోన్‌ను ప్యాంట్ జేబులో.. లేదా హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకుంటారు. జేబులో… ఉండే చిన్న పాటి నూలు పోగులు, దుమ్ము, ధూళి నేరుగా టైప్-సి పోర్ట్ లోపలికి వెళ్లి.. పేరుకు పోతాయి. కాలక్రమేణా ఆ దుమ్ము గట్టిపడి, ఛార్జర్ కేబుల్ పూర్తిగా.. లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల ఛార్జింగ్ లూజ్ సమస్య వస్తుంది.

లోకల్ కేబుల్స్ వాడటం:

ఒరిజినల్ ఛార్జర్ పోయినప్పుడు మార్కెట్లో దొరికే.. రూ. 100 లేదా రూ. 200 లొకల్ కేబుల్స్‌ను వాడుతుంటారు. ఈ క్వాలిటీ లేని కేబుల్స్ కనెక్టర్ సైజ్ సరైన కొలతలతో.. ఉండదు. ఇవి టైప్-సి పోర్ట్ లోపలి గోడలను గీసేస్తాయి. అంతే.. కాకుండా ఓవర్ హీటింగ్ సమస్యకు దారి తీస్తాయి. ఎప్పుడూ ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ బ్రాండెడ్ కేబుల్స్‌ను మాత్రమే..(ధర సుమారు రూ. 400 నుంచి రూ. 1,000 వరకు ఉంటాయి) ఉపయోగించడం మంచిది.

తడిగా ఉన్న చేతులతో వాడటం:

Advertisement

చేతులు తడిగా.. ఉన్నప్పుడు లేదా వర్షాకాలంలో.. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టడం చాలా ప్రమాదకం. పోర్ట్ లోపల నీటి చుక్కలు ఉంటే, కరెంట్ ప్రవహించినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఫోన్ మదర్‌ బోర్డ్‌ను కూడా దెబ్బ తీస్తుంది.

 ఫోన్ లాగడం:

ఫోన్ ఛార్జింగ్‌లో.. ఉన్నప్పుడు దానిని అలాగే బెడ్‌పై.. పట్టుకుని గేమ్‌లు ఆడటం లేదా కాల్స్ మాట్లాడటం చేస్తుంటాం. కేబుల్ లాగ బడటం వల్ల పోర్ట్‌పై విపరీతమైన ప్రెజర్ పడి లోపలి సోల్డరింగ్ ఊడి పోతుంది.

Also Read: వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

టైప్-సి పోర్ట్‌ కోసం చిట్కాలు:

సాఫ్ట్ క్లీనింగ్ చేయండి: పోర్ట్‌లో దుమ్ము చేరితే ఎప్పుడూ సూదులు లేదా మెటల్ వస్తువులు పెట్టకండి. దీని వల్ల పిన్స్ షార్ట్ అవుతాయి. బరకగా లేని మెత్తటి టూత్‌పిక్ లేదా క్లీనింగ్ బ్రష్‌తో.. జాగ్రత్తగా శుభ్రం చేయండి.

యాంటీ-డస్ట్ ప్లగ్స్ : మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌లో.. యాంటీ డస్ట్ ప్లగ్స్ చాలా తక్కువ ధరకే.. (సెట్ రూ. 50 నుంచి రూ. 150 లోపు) లభిస్తాయి. మీరు బయటకు వెళ్లేటప్పుడు వీటిని పోర్ట్‌కు పెట్టుకోవచ్చు.

జెంటల్ హ్యాండ్లింగ్: కేబుల్స్ పెట్టేటప్పుడు, తీసేటప్పుడు ఎప్పుడూ సున్నితంగా వ్యవహరించండి. కేబుల్ వైర్‌ను పట్టుకుని లాగకుండా, దాని ప్లాస్టిక్ హెడ్‌ను పట్టుకుని తీయాలి.

చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. మీ స్మార్ట్‌ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ ఎలాంట సమస్య లేకుండా చాలా కాలం పాటు సరిగ్గా పని చేస్తుంది.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×