E-Paper
Advertisement

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller: మనం నివసించే అపార్ట్‌మెంట్‌ లో పక్కింటి వాళ్లు ఎవరు, ఎదురుగా ఉండేవారు ఎలా ఉంటారు అనే విషయం కూడా కొన్నిసార్లు పట్టించుకోం. రోజూ ఒకే లిఫ్ట్‌లో ప్రయాణించినా, ఒకే కారిడార్‌లో ఎదురు పడినా వారి గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. అలాంటి భవనంలో మనుషులు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతుంటే… ముఖ్యంగా పిల్లలు కూడా ప్రమాదంలో ఉన్నారని అనుమానం వస్తే… మన చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజంగా మంచివారు, ఎవరి వెనుక ఏ రహస్యం దాగుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ కలిగించే హారర్ థ్రిల్లర్ ‘ది సూపర్’ (The Super). మరి హర్రర్ మూవీ లవర్స్ ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…

కథలోకి వెళ్తే…

ఫిల్ లాడ్జ్ గతంలో న్యూయార్క్ పోలీసు విభాగంలో పని చేసిన వ్యక్తి. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల తర్వాత, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి కొత్తగా జీవితం మొదలు పెట్టాలని చూస్తాడు. ఈ క్రమంలో న్యూయార్క్ నగరంలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్ భవనానికి సూపరింటెండెంట్‌ గా ఉద్యోగం తీసుకుంటాడు. ఆ భవనంలో నివసించే వారి సమస్యలను పరిష్కరించడం, నిర్వహణ పనులను చూసుకోవడం అతని బాధ్యత. ఇది సాధారణ ఉద్యోగంలాగే అనిపిస్తుంది. కానీ అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఫిల్‌ కు కొన్ని విషయాలు అనుమానాస్పదంగా కనిపిస్తాయి.

Advertisement

ఆ భవనంలో నివసిస్తున్న కొందరు వ్యక్తులు కనిపించకుండా పోతుంటారు. మొదట వాటిని వేర్వేరు ఘటనలుగా భావించినా, అవి ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానం ఫిల్‌లో పెరుగుతుంది. గతంలో పోలీసుగా పని చేసిన అనుభవం వల్ల అతను చిన్న విషయాలను కూడా గమనిస్తాడు. భవనంలోని వ్యక్తుల ప్రవర్తన, అక్కడి వాతావరణం, కొన్ని అసాధారణ సంఘటనలు అతనిని మరింత అప్రమత్తం చేస్తాయి. ఈ క్రమంలో భవన నిర్వహణ పనులు చూసుకునే వాల్టర్ పై అనుమానం మొదలవుతుంది.

అతని గురించి బయటకు కనిపించేది ఒకటి కాగా, అసలు నిజం మరోలా ఉండవచ్చనే భావన కలుగుతుంది. అయితే అనుమానం రావడం ఒకటైతే, దాన్ని నిరూపించడానికి ఆధారాలు సంపాదించడం మరో టాస్క్. ఫిల్ తన అనుమానాల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో తన ఇద్దరు కూతుళ్ల భద్రత కూడా అతనికి పెద్ద సమస్యగా మారుతుంది. అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న అదృశ్యాల వెనుక ఎవరు ఉన్నారు ? వాల్టర్ నిజంగానే ప్రమాదకరమైన వ్యక్తా ? లేక ఫిల్ అనుమానం తప్పా ? తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే భవనంలో దాగిన రహస్యాన్ని బయట పెట్టగలడా ? అనేది తెలియాలంటే సినిమాపై ఓ లుక్కేయండి.

ఏ ఓటీటీలో ఉంది ?

Advertisement

‘ది సూపర్’ 2017లో విడుదలైన ఇంగ్లిష్ హారర్ థ్రిల్లర్. లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ లేదు. స్టీఫెన్ రిక్ (Stephan Rick) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాట్రిక్ ఫ్లూగర్ (Patrick Flueger), వాల్ కిల్మర్ (Val Kilmer), లూయిసా క్రాస్ (Louisa Krause) తదితరులు నటించారు.

Read Also: అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

Related News

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×