E-Paper
Advertisement

Vivo iQoo Price Hike: రేపటి నుంచే వివో, ఐకూ ఫోన్స్ ధరలు పెంపు.. ఈ రోజే కొనేయండి

Vivo iQoo Price Hike: రేపటి నుంచే వివో, ఐకూ ఫోన్స్ ధరలు పెంపు.. ఈ రోజే కొనేయండి

Vivo iQoo Price Hike| త్వరలోనే అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఫోన్స్ ధరలు పెంచబోతున్నాయి. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా కొన్ని మోడల్స్ ధరలు పెంచేశాయి. ఇదే బాటలో వివో, ఐకూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశంలో త్వరలోనే ఈ రెండు బ్రాండ్ ఫోన్స్ మరింత ఖరీదు చేస్తాయి. మార్చి 1 నుంచి ధరలు పెంచుకోనున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ధరలు పెంచిన తరువాత స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. నిశ్శదంగా పెంచేస్తున్నాయి.

చాలా మిడ్‌రేంజ్ మోడల్స్ ధరలు పెరగనున్నాయి. ధరలు గరిష్టంగా రూ.2,500 వరకు పెరగవచ్చు. వివో లేదా iQOO ఫోన్ కొనాలనుకుంటున్నవారు త్వరగా కొనాలి. మార్చి 1 తర్వాత ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ సమాచారం ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఆరు స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నట్లు చెప్పాడు.

వివో T4x కొత్త ధరలు

వివో T4x 6GB + 128GB వేరియంట్ ఇప్పుడు రూ.15,499కి దొరుకుతోంది. అయితే ఈ ఫోన్ కొత్త ధర రూ.16,999 కావొచ్చు. 8GB + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.18,499. ఇది రూ.20,999కి పెరగవచ్చు. అంటే రూ.1500 ధర పెంపు.

వివో T4R ధర పెంపు వివరాలు

వివో T4R 8GB + 128GB వేరియంట్ ఇప్పుడు రూ.20,999. కానీ ధర రూ.22,999కి పెరగవచ్చు. 12GB + 256GB వేరియంట్ ప్రస్తుత ధర రూ.24,999. కొత్త ధర రూ.26,999 కావొచ్చు. ఈ మోడల్ ధర రూ.2,000 పెరగవచ్చు.

వివో T4 కొత్త ధరలు

వివో T4 8GB + 128GB వేరియంట్ ఇప్పుడు రూ.22,999కి అందుబాటులో ఉంది. రేపటి నుంచి ఈ ఫోన్ ధర రూ.24,999కి పెరగవచ్చు. 12GB + 256GB వేరియంట్ ప్రస్తుత ధర రూ.26,999. కొత్త ధర రూ.28,999 కావొచ్చు. ఈ ఫోన్ కొనాలంటే రూ.2,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

iQOO Z10x ధర పెంపు

iQOO Z10x 6GB + 128GB వేరియంట్ ప్రస్తుత ధర రూ.14,999. కొత్త ధర రూ.16,999 కావొచ్చు. 8GB + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.17,999. రేపటి నుంచి రూ.20,499కి పెరగవచ్చు. ఈ ఫోన్ ధర గరిష్టంగా రూ.2,500 పెరగవచ్చు.

iQOO Z10R కొత్త ధరలు

iQOO Z10R 8GB + 128GB వేరియంట్ ప్రస్తుత ధర రూ.20,999. రేపటి నుంచి ధర రూ.22,999కి పెరగవచ్చు. 12GB + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.24,999 లభిస్తోంది. ఈ ఫోన్ దాదాపు రూ.2000 ధర పెరిగి రూ.26,999కి కొనాల్సి వస్తుంది.

Also Read: మిలటరీ గ్రేడ్ స్లిమ్ ఫోన్‌‌ ధర పెంచేసిన మోటోరోలా.. లాంచ్ అయిన 2 నెలలకే ధర పెంపు

iQOO Z10 కూడా ఎక్కువ ఖరీదు

iQOO Z10 8GB + 128GB వేరియంట్ ఇప్పుడు రూ.24,999 లభిస్తోంది. ధర పెరిగి రేపటి నుంచి రూ.26,999 కావొచ్చు. 12GB + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.26,999. కొత్త ధర రూ.28,999కి పెరగవచ్చు. కొనుగోలుదారులు రూ.2,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

కొనుగోలుదారులు ఏమి చేయాలి?

ఈ ధరల పెంపు మార్చి 1 నుంచి అమలవుతాయి. కంపెనీలు అధికారికంగా ధ‌‌ృవీకరించలేదు. రిపోర్టుల ప్రకారం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మోడల్స్ ఏదైనా కొనాలనుకుంటే త్వరగా కొనండి. మార్చి 1 కంటే ముందు కొనుగోలు చేస్తే రూ.2,500 వరకు ఆదా చేయవచ్చు.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×