Shahid Afridi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka) మధ్య ఇవాళ రాత్రి పల్లెకెలే వేదికగా ( Pallekele International Cricket Stadium, Pallekele) మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. సూపర్ 8 లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ లో అడుగుపెడుతుంది. భారీ పరుగుల తేడాతో శ్రీలంకపై గెలవాల్సిన అవసరం ఉంది. శ్రీలంక పైన 70 పరుగుల తేడాతో విజయం సాధించాలి లేదా 10.5 ఓవర్లలో చేజింగ్ అయినా చేయాలి. అప్పుడే పాకిస్తాన్ కు సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి.
Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శర్మకు ఘోర అవమానం…చెప్పులు చూపించిన యువరాజు
శ్రీలంకపై పాకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( shahid afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకతో ఫిక్సింగ్ చేసుకుంటేనే బతికి బయటపడతామని వెల్లడించారు షాహిద్ ఆఫ్రీది. వెంటనే శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేను కలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సీన్ నఖ్వీ ( Mohsin Naqvi ) మాట్లాడాలని కోరారు. అతనితో ఏదైనా డీలింగ్ కుదుర్చుకొని, శ్రీలంక ఓడిపోయేలా ప్లాన్ చేయాలని వెల్లడించారు షాహిద్ ఆఫ్రీది.
అవసరం అయితే, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేను ( Anura Kumara Disanayake ) కొనేసేయ్ అన సూచనలు చేశారు. అప్పుడే మెరుగైన నెట్ రన్ రేట్ తో సెమీ ఫైనల్లో పాకిస్తాన్ అడుగుపెడుతుందని బాంబు పేల్చారు. పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్లిందంటే కచ్చితంగా ఫైనల్ దాకా వెళ్తుందని పేర్కొన్నారు. ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మ్యాచ్ జరుగుతుందని కూడా తెలిపారు. అప్పుడు మనమే విజయం సాధిస్తామని కూడా బాంబు పేల్చారు షాహిద్ ఆఫ్రీది.
టి20 ఫార్మాట్ లో పాకిస్తాన్ ( Pakistan) అలాగే శ్రీలంక ( Srilanka) మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఈ రికార్డులలో పాకిస్తాన్ పై చేయి సాధించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో పాకిస్తాన్ ఏకంగా 14 మ్యాచ్లలో విజయం సాధించింది. అటు శ్రీలంక కేవలం 10 మ్యాచ్లలో విజయం సాధించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఇవాళ శ్రీలంక పైన పాకిస్తాన్ విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ కు వెళుతుంది. అలా కాదని ఈ మ్యాచ్ లైట్ తీసుకుంటే పాకిస్తాన్ ఇంటికి వెళ్తుంది. దీంతో న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ లు ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.
🚨 MASSIVE STATEMENT BY SHAHID AFRIDI ON FIXING MATCH 🚨
Shahid Afridi Said 🗣️
"I will tell Mohsin Naqvi to talk to the Sri Lankan PM that they should lose this match to us one-sidedly so that the semi-final and final can be held in Sri Lanka, otherwise India will take both… pic.twitter.com/1CRlzvKfWT
— lndian Sports Netwrk (@IS_Netwrk29) February 28, 2026