E-Paper
Advertisement

Gandhi Talks OTT: విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..

Gandhi Talks OTT: విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
Advertisement

Gandhi Talks OTT: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అరవింద్ స్వామి (Arvind Swamy), అదితి రావు హైదరి (Aditi Rao Hydari), సిద్ధార్థ్ జాదవ్ వంటి అద్భుతమైన తారాగణం నటించిన ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రాన్ని కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో మూవీమిల్, క్యోరియస్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల చెంతకు వచ్చేందుకు డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఆ డిటైల్స్‌లోకి వెళితే..

Also Read- Nandi Awards: తెలుగు చిత్ర పరిశ్రమకు నంది అవార్డులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

ఎలాంటి డైలాగ్స్ లేకుండా..

Advertisement

‘గాంధీ టాక్స్’ చిత్రం మార్చి 6 నుండి ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం (Gandhi Talks OTT) తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులోకి రానుందని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘గాంధీ టాక్స్’ సినిమా విషయానికి వస్తే.. వ్యక్తిగత నష్టం, ఆర్థిక ఒడిదుడుకులు, నైతిక సందిగ్ధతలను ఎదుర్కొన్న కొందరి వ్యక్తుల ప్రయాణమే ఈ సినిమా. ఆ వ్యక్తులు ఎవరు? ఎలాంటి వారు? వారి మార్గాలు, ప్రయాణాలు ఎలా కలిశాయి? ఆ తర్వాత కలిగిన పర్యవసానాలేంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా నటీనటుల పెర్ఫామెన్స్, విజువల్స్, మ్యూజిక్‌తోనే కథను నడిపించిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ప్రేక్షకుల హార్ట్ టచ్ చేస్తూ.. వారిని కనెక్ట్ చేసేలా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌‌ను ఈ సినిమా ఇస్తుంది.

Also Read- Sangeetha Vijay: హీరో విజయ్ పై సంగీత పెట్టిన సెక్షన్లు ఇవే… చిక్కుల్లో నటుడు!

సవాల్‌తో కూడుకున్న చిత్రమిది

Advertisement

డిజిటల్ స్ట్రీమింగ్ సందర్భంగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ‘గాంధీ టాక్స్’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. ఎన్నో విషయాల్ని ఈ మూవీ కమ్యూనికేట్ చేస్తుంది. మాటలు లేకుండా మన పర్ఫామెన్స్, ప్రజెన్స్‌తో పూర్తిగా భావోద్వేగాలను వ్యక్తపరచడం ఒక ప్రత్యేకమైన అనుభవం. థియేటర్‌లో అద్భుతమైన స్పందనను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ZEE5 ద్వారా అందరి ఇళ్లలోకి రాబోతోంది. ప్రేక్షకులు మా ‘గాంధీ టాక్స్’తో, అందులోని సందేశంతో కనెక్ట్ అవుతారని, ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారని ఆశిస్తున్నానని అన్నారు. మీ స్వంత మార్గంలో గమనించడానికి, ప్రతిబింబించడానికి, అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించే కథ ఇదని అదితి రావు హైదరి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. సవాల్‌తో కూడుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ చిత్రానికి లభించిన ప్రేమ, ప్రశంసలు నాకు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించాయి. ఇప్పుడీ చిత్రాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ZEE5 వేదిక అవుతున్నందుకు కృతజ్ఞుడను. ఓటీటీలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలుసుకునేందుకు ఎంతగానో వేచి చూస్తున్నానని అన్నారు. ZEE5లో మార్చి 6 నుండి ‘గాంధీ టాక్స్‌’ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం‌లో ప్రసారం కానుంది.

Also Read- Kissik Talks Promo: ప్రేమ, పెళ్లి, విడాకులు.. అమ్మాయిలు అలా ఉండకూడదు: హరిత

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×