E-Paper
Advertisement

Realme 13 Pro Series Launch: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. వావ్ అనిపిస్తున్న AI కెమెరా ఫీచర్లు!

Realme 13 Pro Series Launch: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. వావ్ అనిపిస్తున్న AI కెమెరా ఫీచర్లు!

Realme 13 Pro Series Launch: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ ఈ రోజు అంటే జూలై 30 న దేశంలో రియల్‌మీ 13 ప్రో సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ లైనప్‌లో రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో ప్లస్ 5జీ ఉన్నాయి. లాంచ్‌కు ముందు కంపెనీ బ్రాండ్ అఫిషియల్ సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 30న సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య అడ్వాన్స్ యాక్సెస్ సేల్ ఆఫర్ లైవ్ చేయనుంది.ఈ మిడ్ రేంజ్ ప్రైస్ ఫోన్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. వీటిపై ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

రియల్‌మీ 13 ప్రో, 13 ప్రో ప్లస్ ఎర్లీ యాక్సెస్ సేల్ సమయంలో కొనుగోలుదారులు డివైస్‌పై బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందొచ్చు. అలానే అదనంగా కస్టమర్‌లు 12 నెలల నో-కాస్ట్ EMIని ద్వారా దక్కించుకోవచ్చు. కొనుగోలుదారులు ఆగస్టు 12లోపు హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేస్తే ఒక సంవత్సరం అదనపు వారంటీ, 30 రోజుల ఉచిత రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా పొందుతారు. లాంచ్ సమయంలో స్మార్ట్‌ఫోన్ ధరను వెల్లడించే అవకాశం ఉంది. అయితే రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్ల కొన్ని ఫీటర్లను వెల్లడించింది.

Also Read: Vivo New Smartphones: వివో నుంచి బడ్డెట్ ఫోన్.. ఆగస్టు 7 న లాంచ్.. ధర ఎంతంటే?

Realme 13 Pro Plus Specifications
ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ 50MP Sony కెమెరా (Sony LYT-701 Sony LYT-600)తో వస్తుంది. ఇది క్వాలిటీ ఫోటోల కోసం OIS, AI ఫీచర్లను అందిస్తుంది. వీటిలో AI అల్ట్రా క్లారిటీ, AI స్మార్ట్ రిమూవల్, AI గ్రూప్ ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, AI ఆడియో జూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌లలో విడుదల కానుంది. హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్, 80W ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీ ఉంటుంది. DSLR కెమెరా క్వాలిటీతో కూడిన షాట్‌లను అందించడానికి గ్యాడ్జెట్లు AI ఎడిటింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

Realme 13 Pro 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ పర్పుల్ కలర్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఫోన్ రియల్‌మీ మైక్రోసైట్ ప్రకారం Sony LYT-600 సెన్సార్ కలిగి ఉంటుంది. ప్రో ప్లస్ వేరియంట్ లాగా ఇది కూడా AI ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫోన్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్, IP65 రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 7s Gen 2, 45W ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Realme 13 Pro Series Price
దేశంలో Realme 13 Pro ధర రూ. 25,000 నుండి ప్రారంభమవుతుంది. Realme 13 Pro Plus ధర రూ. 30,000 కంటే తక్కువగా ఉండవచ్చు. రియల్‌మీ 13 Pro 5జీ సిరీస్‌తో పాటు, కంపెనీ ఈ ఈవెంట్‌లో రియల్‌మీ Watch S2, రియల్‌మీ Buds T310 TWSలను కూడా విడుదల చేస్తుంది.

Related News

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ. 5000 పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

Big Stories

×