E-Paper
Advertisement

Telangana Assembly Sessions: ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలు మాత్రమే!

Telangana Assembly Sessions: ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలు మాత్రమే!
Advertisement

Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆరో రోజు సభ ప్రారంభమైంది. ప్రస్తుతం బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. కాగా, వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడా శాఖల పద్దులపై చర్చిస్తున్నారు.

అయితే సోమవారం చర్చించాల్సిన అంశాలు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సూచనలు చేశారు. సోమవారం జరిగిన మాదిరిగా సుదీర్ఘ ప్రసంగాలు చేయకూడదని సభ్యులకు సూచించారు. ఈ మేరకు ఒక్కో సభ్యుడికి కేవలం 15 నిమిషాల సమయం కేటాయించారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని.. సబ్జెక్టుపైనే మాట్లాడాలని చెప్పారు. అయితే సోమవారం విద్యుత్ అంశంపై వాడీవేడిగా చర్చించిన సంగతి తెలిసిందే.

Advertisement

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. ఈ సమావేశంలో 19 అంశాలపై చర్చించనున్నారు. అయితే ప్రధానంగా ఇరిగేషన్, సివిల్ సప్లైపై వాడీవేడిగా చర్చస్తున్నారు. అలాగు 1.5లక్షల రుణాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. రెండో విడతలో 7 లక్షలమంది రైతులకు రూ.6,100కోట్లను జమ చేయనుంది. మధ్యాహ్నం 1వరకు అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×