BigTV English

Mahesh Babu: ధునుష్ ‘రాయన్’ సినిమాపై హీరో మహేశ్‌బాబు కామెంట్స్..ఏం చెప్పారంటే?

Mahesh Babu: ధునుష్ ‘రాయన్’ సినిమాపై హీరో మహేశ్‌బాబు కామెంట్స్..ఏం చెప్పారంటే?

Mahesh Babu About Raayan Movie: కోలీవుడ్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రాయన్’ రికార్డులు సృష్టిస్తోంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాలో సందీప్ కిషన్, మలయాళ నటుడు కాళిదాస్ జయరాం కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య జూలై 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ కొల్లగొడుతోంది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ధనుష్ డైరెక్షన్‌కు మార్కులు వేస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు సైతం కితాబిచ్చారు.


మహేశ్ బాబు రాయన్ సినిమాపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘రాయన్ సినిమా చూశా. ధనుష్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంది. నటనతోపాటు దర్శకత్వం కూడా చాలా బాగా చేశాడు. ధనుష్ తోపాటు సూర్య, ప్రకాశ్ రాజ్, సందీఫ్ కిషన్‌ల పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఇక సంగీతం విషయానికొస్తే..ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సంగీతంతో ఓ లెవల్ కు తీసుకెళ్లారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. రాయన్ టీంకు ప్రత్యేక అభినందనలు.’ అంటూ ఎక్స్ వేదికగా మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

అలాగే, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రాయన్ టీంను అభినందించారు. తాజాగా, మరో హీరో లారెన్స్ సైతం రాయన్ సినిమా ను చూశాు. ధనుష్ నటనచ డైరెక్షన్ అద్భుతంగా ఉందని చెప్పారు. అయితే సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంపైనే డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటివరకు అతని నటను గురించే మాత్రమే తెలుసు. కానీ ఈ సినిమాతో డైరెక్షన్ కూడా ఓ లెవల్ అందించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


Also Read: చిరంజీవి, పవన్, రామ్ చరణ్ లతో పాన్ ఇండియా మూవీ ..సంబరాలలో మెగా ఫ్యాన్స్

ఇదిలా ఉండగా, ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ విమర్శకుల నుంచి సైతం మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.100కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తోంది. సినిమా విషయానికొస్తే..ఇందులో హీరో తమ్ముళ్లుగా సందీప్ కిషన్, కాళీదాస్ జయరామ్ నటించారు. చెల్లెల్లి పాత్రలో దుషారా విజయన్ నటించగా..ప్రతినాయకుడిగా సఎస్.జె.సూర్య, పోలీస్ ఆఫీసర్ గా ప్రకాశ్ రాజ్ నటించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×