E-Paper
Advertisement

ఆ లుక్ ఏంది సామీ.. వీగన్ లెదర్, భారీ బ్యాటరీతో ‘Redmi Note 15 SE 5G’ భారత్‌లో లాంచ్!

ఆ లుక్ ఏంది సామీ.. వీగన్ లెదర్, భారీ బ్యాటరీతో ‘Redmi Note 15 SE 5G’ భారత్‌లో లాంచ్!
Advertisement

Redmi Note 15 SE 5G: టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ స్పెషల్ ఎడిషన్ ఎట్టకేలకు భారతదేశంలో ‘Redmi Note 15 SE 5G’ పేరుతో విడుదలైంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన Note 15 సిరీస్‌లో ఇదొక స్పెషల్ ఎడిషన్ అన్నమాట. దీని వెనుక వైపు ఇచ్చిన వీగన్ లెదర్ ఫినిషింగ్ ఫోన్‌కు చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. లుక్ మాత్రమే కాదు.. ఫీచర్లు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి బడ్జెట్‌లో మంచి ఫోన్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఆఫర్ వివరాలు ఇలా..

ఈ ఫోన్ ధరల విషయానికి వస్తే.. 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ రూ.24,999గా ఉంది. కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 8GB + 128GB మోడల్ రూ.25,999కి, ఇక టాప్ ఎండ్ మోడల్ 8GB + 256GB వేరియంట్ రూ.27,999కి అందుబాటులో ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే.. ICICI బ్యాంక్ కార్డు ఉపయోగిస్తే రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీనికి తోడు కంపెనీ ఇచ్చే రూ.4,000 స్పెషల్ ఇంట్రడక్టరీ ఆఫర్ కూడా కలిపితే ధర చాలా వరకు తగ్గుతుంది. ఈ ఫోన్ ఏప్రిల్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్, షావోమీ వెబ్‌సైట్లలో దొరుకుతుంది. కార్బన్ బ్లాక్, రెడ్, వైట్ కలర్స్‌లో ఇది వస్తోంది.

Advertisement

Also Read: ధర తక్కువే కానీ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్.. Redmi A7 Proలో గూగుల్ AI ఫీచర్లు కూడా!

కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే హైలైట్..

ఈ Redmi Note 15 SE 5Gని చూడగానే ముందుగా మనల్ని ఆకట్టుకునేది దీని 6.77 అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే. ఫోన్ స్క్రీన్ అంచులు వంపు తిరిగి ఉండటం వల్ల చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఎండలో చూసినా కూడా స్క్రీన్ పైన అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఎందుకంటే.. దీనిలో 3,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ వాడారు. దీంతో గేమ్స్ ఆడినా, భారీ యాప్స్ వాడుతున్నా ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా వేగంగా పని చేస్తుందన్నమాట. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2 మీద రన్ అవుతుంది.

కెమెరా అదిరింది..

Advertisement

ఫొటోలు తీసుకోవడం అంటే ఇష్టం ఉన్నవారి కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 20MP కెమెరాను అమర్చారు. దీనితో మనం 4K వీడియోలు కూడా తీసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో అతి పెద్ద హైలైట్ ఏంటంటే.. 5,800mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే హ్యాపీగా రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. మళ్లీ ఛార్జింగ్ కూడా ఫాస్ట్‌గా అవ్వడం కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ బరువు తక్కువగా ఉండటంతో పాటు, వర్షం చినుకులు పడినా లేదా దుమ్ము తగిలినా పాడవకుండా ఉండటానికి ఐపీ రేటింగ్‌ను కూడా అందించారు.

Also Read: 8,000mAh బ్యాటరీ, అదిరిపోయే కూలింగ్ ఫ్యాన్‌తో ‘Oppo K15 Pro’ సిరీస్ లాంచ్!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

రూ.908కే అదిరిపోయే సౌండ్..యూత్ ఫిదా అయ్యే ట్రెండింగ్ బ్లూటూత్ స్పీకర్!

iPhone 18 Proలో బ్లాక్ కలర్ ఉండదా? తాజా లీక్‌తో యాపిల్ ప్రియుల్లో పెరిగిన టెన్షన్!

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!

Big Stories

Advertisement
×