E-Paper
Advertisement

Realme 16 Pro: 200MP బ్యాక్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, 7000mAh బ్యాటరీ.. రియల్‌మీ కొత్త ఫోన్లు లాంచ్

Realme 16 Pro: 200MP బ్యాక్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, 7000mAh బ్యాటరీ.. రియల్‌మీ కొత్త ఫోన్లు లాంచ్
Advertisement

Realme 16 Pro Plus| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ తాజగా భారతదేశంలో తన కొత్త రియల్‌మీ 16 ప్రో సిరీస్‌ ఫోన్లు అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో ప్లస్ అనే రెండు మోడల్స్ ఉన్నాయి. గేమింగ్, కెమెరా, బ్యాటరీ లైఫ్‌పై ప్రత్యేక ఫోకస్‌తో ఈ ఫోన్లు తయారుచేసింది రియల్‌మీ. ప్రీమియం మిడ్-రేంజ్ కస్టమర్లకు ఇవి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. రెండు ఫోన్లలోనూ పెద్ద బ్యాటరీ, అద్భుతమైన కెమెరా, బలమైన డ్యూరబిలిటీ ఫీచర్లు ఉన్నాయి.

రియల్‌మీ 16 ప్రో సిరీస్ ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్

రియల్‌మీ 16 ప్రో ప్లస్ మోడల్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్‌తో పాటు రోజువారీ పనులకు బాగా పనిచేస్తుంది. రియల్‌మీ 16 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మాక్స్ చిప్‌సెట్ ఉంది. ఈ ప్రాసెసర్ మంచి పవర్ ఎఫిషియెన్సీ ఇస్తుంది. రెండు ఫోన్లు రియల్‌మీ UI 7.0 సాఫ్ట్‌వేర్‌పై ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి. కంపెనీ మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తోంది.

భారతదేశంలో రియల్‌మీ 16 ప్రో, ప్రో ప్లస్ ధరలు ఇవే

Advertisement

ఇండియాలో రియల్‌మీ 16 ప్రో ప్రారంభ ధర రూ.31,999. ఇది 8GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర . 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.33,999. 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.36,999. ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్స్.. మాస్టర్ గోల్డ్, పెబుల్ గ్రే, ఆర్చిడ్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది.

రియల్‌మీ 16 ప్రో ప్లస్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్+ 128GB స్టోరేజ్ ధర రూ.39,999. 8GB + 256GB ధర రూ.41,999. 12GB ర్యామ్ + 256GB ధర రూ.44,999. ప్రో ప్లస్ మోడల్ రెండు కలర్ వేరియంట్స్.. మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే కలర్స్‌లో వస్తుంది. రెండు ఫోన్ల సేల్స్ జనవరి 9 నుంచి ప్రారంభమవుతాయి.

డిస్‌ప్లే, AI ఫీచర్లు

Advertisement

రెండు ఫోన్లలోనూ బ్రైట్ AMOLED డిస్‌ప్లే ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 6,500 నిట్స్ వరకు వస్తుంది. ఇవి TÜV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో కళ్లకు మంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. పగలు కూడా ఎండలో క్లియర్‌గా కనిపిస్తాయి. NEXT AI ఫీచర్లు కెమెరా, సిస్టమ్ పర్‌ఫామెన్స్ మెరుగుపరుస్తాయి.

కెమెరా సెటప్, ఫోటోగ్రఫీ ఫీచర్స్

ఈ సిరీస్ ఫోన్లు కెమెరా పర్‌ఫామెన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. రెండు ఫోన్లలోనూ 200MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. 50MP పెరిస్కోప్ కెమెరా జూమ్ ఫోటోలకు సహాయపడుతుంది. సెల్ఫీల కోసం కూడా 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం చాలా క్లియర్‌గా వస్తాయి.

బ్యాటరీ, చార్జింగ్, డ్యూరబిలిటీ

రెండు ఫోన్లలోనూ 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఒక రోజుకు పైగా సులభంగా రన్ అవుతుంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. IP66, IP68, IP69 రేటింగ్స్‌తో దుమ్మ, నీరు పడినా, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా ఫోన్ బాగా పనిచేస్తుంది.

రియల్‌మీ 16 ప్రో సిరీస్

రియల్‌మీ 16 ప్రో సిరీస్ పవర్, డ్యూరబిలిటీ, అడ్వాన్స్‌డ్ కెమెరాలను కలిగి ఉంది. ప్రీమియం ఫీచర్లు కావాల్సినవారికి మంచి ధరలో బెస్ట్ ఛాయిస్. ఈ ఫోన్లు యంగ్ యూజర్లకు చాలా బాగా నచ్చుతాయి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×