E-Paper
Advertisement

Revenge Drama OTT : మూగపిల్లను ర్యాంగింగ్ చేసే గ్యాంగ్ మర్డర్ మిస్టరీ… సీను సీనుకో ట్విస్ట్

Revenge Drama OTT : మూగపిల్లను ర్యాంగింగ్ చేసే గ్యాంగ్ మర్డర్ మిస్టరీ… సీను సీనుకో ట్విస్ట్
Advertisement

Revenge Drama OTT : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ? సీను సీనుకో ట్విస్ట్ తో ఊహించని మలుపులు ఉండే ఇలాంటి సినిమాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాలలో బ్రూటల్ మర్డర్స్, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, వంటి అంశాలు మెండుగా ఉంటాయి. ఇక మనం ఇప్పుడు చెప్పుకునే సినిమాలో కూడా ఇలాంటివి కావలసినన్ని ఉంటాయి. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? దాని కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇదివరకు స్కూల్, కాలేజీల్లో జరిగే ర్యాగింగ్ గురించే ఎక్కువగా చర్చ జరిగేది. హద్దు దాటిన ర్యాగింగ్ వల్ల ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల కాలంలో దీని గురించి పెద్దగా వార్తలు విన్పించట్లేదు. ఎక్కడో ఒక చోట తప్పితే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కూడా ర్యాగింగ్, ప్రతీకారం చుట్టూ తిరిగే డార్క్ క్రైమ్ థ్రిల్లరే. ఈ మూవీ పేరు ‘ఎ ప్లేస్ కాల్డ్ సైలెన్స్’ (2024). సామ్ క్వా దర్శకత్వం వహించిన ఈ చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ 2022లో వచ్చిన ఓ మలేషియన్ ఫిల్మ్ కి రీమేక్ గా రూపొందింది. వాంగ్ చువాన్‌జున్, నింగ్ చాంగ్, ఫ్రాన్సిస్ ఎన్జీ, వాంగ్ షెంగ్‌డి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 2024 జులై 3న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, చైనాలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. 1 గంట 59 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మాండరిన్ ఆడియోతో, ఇంగ్షీషు సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. భాష అడ్డు కాదనుకుంటే వెంటనే ఒక లుక్కేయండి.

Advertisement

Read Also :  పోలీసులు మాత్రమే ఉండే కొండపై ప్రత్యక్షమయ్యే డెడ్ బాడీ… ‘ఎకో’ లాంటి మిస్టరీ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

ఆల్-గర్ల్స్ మిడిల్ స్కూల్‌ లో ఈ మూవీ కథ సాగుతుంది. చెన్ యుటాంగ్ (వాంగ్ షెంగ్‌డి) అనే మూగ అమ్మాయిని ఆ గర్ల్ స్కూల్‌ లో జాలి అన్నదే లేకుండా ఏడిపిస్తారు. ఆమె తల్లి లీ హాన్ (నింగ్ చాంగ్) స్కూల్‌లోనే పని చేస్తుంది. కానీ కూతురును వాళ్ళ నుంచి కాపాడుకోలేకపోతుంది. స్కూల్‌ టీచర్స్ నుంచి అక్కడ చదువుకునే స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ ఈ విషయాన్ని చూసీ చూడనట్టుగా వదిలేస్తారు. దీంతో ఆ పిల్లలు మరింత రెచ్చిపోయి వయోలెంట్ గా మారతారు. వాళ్ళ టార్చర్ మితిమీరిన టైమ్ లోనే యుటాంగ్ అకస్మాత్తుగా మిస్ అవుతుంది.

Advertisement

ఆ అమ్మాయి ఏమయ్యిందా అని అందరూ గాబరా పడుతుండగానే, స్కూల్‌ లో సీరియల్ మర్డర్స్ మొదలవుతాయి. ఆ మూగ పిల్లని ఏడిపించిన ఒక్కొక్కరిని టార్గెట్ చేసి చంపుతారు. ఈ ఘటనతో స్కూల్ అంతా వణికిపోతుంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ షురూ చేస్తారు. విచారణలో ఊహించని షాకింగ్ నిజాలు బయట పడతాయి. మరి ఇంతకీ ఆ మూగ పిల్ల ఏమైంది ? స్కూల్ లో వరుస మర్డర్స్ చేస్తుంది ఎవరు ? కిల్లర్ ఎందుకు ఆ మూగ పిల్లను వేధించిన వాళ్ళనే టార్గెట్ చేసి చంపుతున్నాడు ? అన్నది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×