E-Paper
Advertisement

ఫోన్ కింద పడ్డా, నీళ్లలో మునిగినా నో ప్రాబ్లం.. రియల్‌మీ నుంచి రఫ్ అండ్ టఫ్ 5G మొబైల్ వస్తోందోచ్!

ఫోన్ కింద పడ్డా, నీళ్లలో మునిగినా నో ప్రాబ్లం.. రియల్‌మీ నుంచి రఫ్ అండ్ టఫ్ 5G మొబైల్ వస్తోందోచ్!
Advertisement

Realme 16T 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ప్రముఖ రియల్‌మీ సంస్థ మరో క్రేజీ న్యూస్ చెప్పింది. తమ సరికొత్త మొబైల్ Realme 16T 5Gని ఈనెల 22న ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసింది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది దొరకనుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కెమెరా విశేషాలు, డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు బయటకు వచ్చి టెక్ లవర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ప్రత్యేకమైన సెల్పీ మిర్రర్..

ఈ కొత్త ఫోన్ ప్రధానంగా కెమెరా ప్రియులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. దీనిలో 50MP సోనీ IMX852 సెన్సార్‌ను వాడుతున్నారు. దీనివల్ల ఫొటోలు చాలా స్పష్టంగా, సహజమైన రంగులతో వస్తాయి. రాత్రి వేళల్లో లేదా వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా ముఖం స్పష్టంగా కనిపించేలా ఇందులో ప్రత్యేకమైన ఏఐ పోర్ట్రెయిట్ గ్లో ఫీచర్‌ను పెట్టారు. అన్నిటికంటే వినూత్నమైన విషయం ఏంటంటే.. ఫోన్ వెనుక భాగంలో ఒక సెల్ఫీ మిర్రర్ ఉంటుంది. దీని సాయంతో వెనుక వైపు ఉన్న మెయిన్ కెమెరాతోనే మనల్ని మనం చూసుకుంటూ సూపర్ క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవచ్చు.

Advertisement

Also Read: ఏసీ లేకపోయినా ఇల్లు కూల్ కూల్‌గా ఉండాలా? అయితే మన తాతల కాలపు ఈ ‘కూలింగ్ హ్యాక్స్’ ట్రై చేయండి!

రఫ్ అండ్ టఫ్ బాడీ..

సినిమాలు చూడటానికి, గేములు ఆడుకోవడానికి వీలుగా ఈ ఫోన్‌లో 144Hz రీఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 2,100 నిట్స్ బ్రైట్‌నెస్ దీని సొంతం. పాటలు గట్టిగా వినడానికి 400 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కూడా జోడించారు. ఇక ఫోన్ గట్టిదనం విషయానికొస్తే.. ఇది ఐపీ69 ప్రో రేటింగ్‌తో వస్తోంది. దీంతో దుమ్ము, నీటి వల్ల ఫోన్ పాడవదు. పొరపాటున కిందపడినా తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా దీనికి ఉంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

ఈ Realme 16T 5Gలో ఏకంగా 8,000mAh బ్యాటరీని ఇస్తుండటం విశేషం. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడ్రోజుల వరకు నిరంతరాయంగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8GB RAM, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ నడవనుంది. దాదాపు ఆరేళ్ల పాటు ఎలాంటి లాగ్ లేకుండా, ఎంతో స్మూత్‌గా పనిచేస్తుందని రియల్‌మీ హామీ ఇస్తోంది. స్టార్‌లైట్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్లలో లభించే ఈ ఫోన్ ధర ఎంతో తెలియాలంటే మే 22 వరకు ఆగాల్సిందే.

Also Read: సింగిల్ ఛార్జ్‌తో రెండ్రోజులు నాన్‌స్టాఫ్ మ్యూజిక్.. Moto Buds 2 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×