E-Paper
Advertisement

బండి రోడ్డుపై వదిలేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీ వాహనంపై హక్కు కోల్పోయే ప్రమాదం!

బండి రోడ్డుపై వదిలేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీ వాహనంపై హక్కు కోల్పోయే ప్రమాదం!
Advertisement

Parking Policy: తెలంగాణలో వాహనదారులకు ఇక గడ్డుకాలం మొదలుకానుంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ బండిని ఆపేసి “కాసేపే కదా” అని వెళ్లే రోజులకు చెక్ పడబోతోంది. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర రవాణా శాఖ సిద్ధం చేసిన ‘నూతన పార్కింగ్ పాలసీ’ ముసాయిదా ఇప్పుడు వాహనదారుల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, మీ నిర్లక్ష్యం మీ జేబుకు చిల్లు పెట్టడమే కాదు.. ఏకంగా మీ వాహనాన్ని మీ నుంచి దూరం చేసే ప్రమాదం కూడా ఉంది.

రోడ్డుపై బండి ఆపితే.. ఇక అది ప్రభుత్వ సొంతమే!
ఇప్పటి వరకు నో పార్కింగ్‌లో బండి పెడితే కేవలం చలాన్ కట్టి తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త పాలసీ ప్రకారం, ఫుట్‌పాత్‌లపై లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా వాహనాలను వదిలేస్తే అధికారులు వాటిని వెంటనే టోయింగ్ చేసి తీసుకెళ్లిపోతారు. స్వాధీనం చేసుకున్న వాహనాన్ని యజమాని తిరిగి పొందాలంటే కేవలం జరిమానా కడితే సరిపోదు; టోయింగ్ ఖర్చులతో పాటు, ఆ వాహనం యార్డులో ఉన్న ప్రతి రోజుకు ప్రత్యేకంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలి. అంతేకాదు, పాత పెండింగ్ చలాన్లు అన్నీ క్లియర్ చేస్తేనే బండిని బయటకు వదిలేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు.

Advertisement

45 రోజులు దాటితే.. బహిరంగ వేలం!
ఈ ముసాయిదాలో అందరినీ షాక్‌కు గురిచేస్తున్న అంశం ‘వాహనాల వేలం’. అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని నిర్ణీత గడువు (నెల నుంచి 45 రోజులు) లోపు యజమాని విడిపించుకోకపోతే, ఇక ఆ వాహనంపై యజమానికి ఎటువంటి హక్కు ఉండదు. ప్రభుత్వం ఆ వాహనాన్ని బహిరంగ వేలం వేసి సొమ్ము చేసుకుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా పీపీపీ (PPP) పద్ధతిలో అత్యాధునిక పార్కింగ్ యార్డులను నిర్మించాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. అంటే, మీ బండిని నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేస్తే అది కాస్తా వేలం పాటలోకి వెళ్లిపోతుందన్నమాట.

ప్రాంతాన్ని బట్టి ‘డైలీ రెంట్’ బాదుడు
వాహనాలను నిర్బంధించిన కాలానికి వసూలు చేసే రోజువారీ పార్కింగ్ ఫీజులు కూడా సామాన్యులకు భారంగా మారనున్నాయి. ప్రాంతం, వాహన రకాన్ని బట్టి ఈ ధరలు మారుతుంటాయి.

Advertisement

టూవీలర్స్: రోజుకు రూ. 20 నుండి రూ. 30.

ఆటోలు: రూ. 35 నుండి రూ. 50.

కార్లు: రూ. 60 నుండి రూ. 80.

బస్సులు/లారీలు: రూ. 200 నుండి రూ. 300 వరకు.
పది రోజులు బండి యార్డులో ఉంటే, జరిమానాతో పాటు అదనంగా వందల రూపాయలు పార్కింగ్ ఫీజు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘మాస్టర్ ప్లాన్’
నగరీకరణ వేగంగా పెరుగుతున్న తరుణంలో ట్రాఫిక్ సమస్యలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ సమగ్ర పార్కింగ్ పాలసీని రూపొందించింది. కేవలం జరిమానాలు వేయడమే లక్ష్యం కాకుండా, ప్రజల్లో క్రమశిక్షణ తీసుకురావడం, రోడ్లను పాదచారులకు, వాహనాలకు సాఫీగా అందుబాటులో ఉంచడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వం త్వరలోనే ఈ ముసాయిదాపై ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించి తుది నిర్ణయం తీసుకోనుంది.

వాహనదారులకు హెచ్చరిక..
రాబోయే రోజుల్లో సొంత వాహనం ఉండటం ఎంత సౌకర్యమో, దాన్ని ఎక్కడ పార్క్ చేస్తున్నామనేది అంతకంటే ముఖ్యం కానుంది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు లేదా ఆఫీసులకు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఖాళీ ఉంది కదా అని బండిని నిలిపితే.. తిరిగి వచ్చేసరికి అక్కడ మీ వాహనం ఉండకపోవచ్చు. కాబట్టి, ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను ఉంచడం ఉత్తమం. లేదంటే భారీ పెనాల్టీలతో పాటు మీ వాహనాన్ని శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచి ఉంది.

Also Read: బంగారం, పాలు, చక్కెర.. వరుసగా బాదుడు! అసలు ముప్పు ముందే ఉందా? మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×