E-Paper
Advertisement

Realme Buds T110 : రియల్ మీ నుంచి కొత్త ఇయర్‌‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లాల్సిందే!

Realme Buds T110 : రియల్ మీ నుంచి కొత్త ఇయర్‌‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లాల్సిందే!
Advertisement

Realme Buds T110 : ప్రముఖ చైనా కంపెనీ రియల్ మీకి దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. దేశీయ ఇతర టెక్ కంపెనీలకు మంచి కాంపిటీటర్‌గా ఉంది. మిడ్‌ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ ఎక్కువగా గ్యాడ్జెట్లను లాంచ్ చేస్తుంది. రియల్ ఏ ప్రొడక్ట్ లాంచ్ చేసిన తక్కువ ప్రైజ్‌‌లో తీసుకొస్తుంది. రియల్ మీ ఫ్యాన్స్ దేశంలో అధికంగానే ఉంటారు. ఏప్రిల్ 15న రియల్ మీ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు, టాబ్లాట్‌ను తీసుకొచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చూసేందుకు సిద్థమైంది. ఆ ఇయర్‌బడ్స్ ఫీచర్లు, ధర తదితర విషయాలను తెలుసుకోండి.

మీరు కొత్త ఇయర్‌బడ్స్ కొనాలని భావిస్తుంటే.. రియల్ ‌మీ తీసుకొస్తున్న Buds T110ను కొనుగోలు చేయవచ్చు. బడ్స్ ఇన్ ఇయర్, టూ టోన్ హిట్ కలర్ డిజైన్‌తో ఈ బడ్స్ వస్తాయి. బడ్స్‌లో అదిరిపోయే బేస్ కోసం 10mm డైనమిక్ బాస్ డ్రైవర్ ఉంటుంది. అంతేకాకుండా డయాఫ్రాగమ్‌ కోసం పీక్+పు కాంపోజిట్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే బడ్స్ బ్లూటూత్ 5.4, AAC సపోర్ట్, 2500IUC చిప్‌తో వస్తాయి. బడ్స్ 102dB±2 గరిష్ట వాల్యూమ్‌ అందిస్తాయి.

Advertisement

Also Read : మోటో నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్‌పై ఓ లుక్కేయండి!

అలానే బడ్స్‌లో బ్రైట్, బ్యాలెన్స్‌డ్, బాస్ బూస్ట్+ మోడ్‌ల సౌకర్యం ఉంది. మీరు వాల్యూమ్ ఎన్‌హాన్సర్‌ను ఆఫ్‌లో ఉంచినట్లయితే బడ్స్ 38 గంటల ప్లేబ్యాక్‌ను కేస్ ఇస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే బడ్స్ 40mAh ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ 460mAh పవర్ కేస్‌తో వస్తాయి. 120 నిమిషాల ప్లేబ్యాక్ కోసం బడ్స్‌ను 10 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా కాల్స్ కోసం AI ENC నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

Advertisement

బడ్స్ 88ms లేటెన్సీతో సూపర్ లేటెన్సీ గేమింగ్ మోడ్‌తో వస్తాయి. ఇవి  IPX5 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్నాయి. రియల్ మీ లింక్ యాప్ ద్వారా టచ్ ఫంక్షన్‌ను మేనేజ్ చేయవచ్చు. అప్‌డేట్లను కూడా పొందవచ్చు. బడ్స్ టచ్ కంట్రోల్స్‌తో వస్తాయి. అంతేకాకుండా మీకు వచ్చే నోటిఫికేషన్లను ఆడియోతో అందిస్తాయి. బడ్స్ 4.09g బరువుతో వస్తాయి. కంట్రీ గ్రీన్, పంక్ బ్లాక్, జాజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read : కిలో చికెన్ ధరకే Realme Norzo N53 స్మార్ట్‌ఫోన్.. కానీ అది ఉండాల్సిందే..!

ఇక రియల్ మీ Buds T110 ధర గురించి మాట్లాడితే.. కొత్త బడ్స్‌ను రూ. 1,499గా కంపెనీ నిర్ణయించింది. అయితే బడ్స్‌కు రూ.200 తగ్గింపు కూడా అందిస్తున్నారు. ఈ బడ్స్‌ను ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12 గంటల నుండి రూ.1299కి కొనుగోలు చేయవచ్చు.రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ నుంచి బడ్స్ కొనెగోలు చేయవచ్చు.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×