E-Paper
Advertisement

Shankar Daughter Reception: శంకర్ కుమార్తె రెండో పెళ్లి.. హాజరైన మెగాస్టార్ ఫ్యామిలీ

Shankar Daughter Reception: శంకర్ కుమార్తె రెండో పెళ్లి.. హాజరైన మెగాస్టార్ ఫ్యామిలీ
Advertisement

Shankar Daughter Reception: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ రెండో వివాహం నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న తరుణ్ కార్తికేయన్ కు ఇచ్చి ఐశ్వర్యకు వివాహం జరిపించాడు. చెన్నైలో వీరి వివాహాం ఘనంగా జరిగింది.

రజినీకాంత్, సూర్య, కమల్ హాసన్, విక్రమ్, నయనతార లాంటి ప్రముఖులు ఈ పెళ్ళికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక నేడు వీరి రిసెప్షన్ మరింత గ్రాండ్ గా జరిగింది. ఐశ్వర్య పెళ్ళికి హాజరుకాలేని మెగాస్టార్ ఫ్యామిలీ.. రిసెప్షన్ లో సందడి చేశారు. ప్రస్తుతం శంకర్.. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Advertisement

ఇక ఈ నేపథ్యంలోనే తన కుమార్తె పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవిని, రామ్ చరణ్ ను శంకర్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. ఇక పెళ్ళికి అటెంట్ కాలేకపోయినా మెగాస్టార్ కుటుంబం.. రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కలిసి ఈ రిసెప్షన్ కు హాజరు అయ్యారు. ఇక త్వరలోనే గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చరణ్- శంకర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×