Big Stories

Moto G64 5G Launch: మోటో నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్‌పై ఓ లుక్కేయండి!

New Moto g64 5G launch & Price Details: దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వాడకం కూడా భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఫోన్ నేటి అవసరాల కారణంగా జీవితంలో భాగమైపోయింది. కంపెనీలు సైతం గ్యాప్ లేకుండా వరుసబెట్టి స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ g64 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 14న ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. భారీ బ్యాటరీతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్  2400 x 1080 రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అలానే 5G కనెక్టివిటీ కోసం 14 బ్యాండ్‌ల మద్దతును కలిగి ఉంటుంది.

- Advertisement -

Also Read: రూ.364కే స్మార్ట్‌ఫోన్.. ఎలానో తెలుసా?

ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఫ్లిప్‌కార్ట్‌, మోటో అధికారికి వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.ఇది ఇండియన్ మార్కెట్లో మూడు కలర్ ఆప్షన్లతో రానుంది. దీని ధర రూ.18,900 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Moto g64 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAMతో 256GB స్టేరేజ్ కలిగి ఉంటుంది. కంపెనీ MediaTek Dimension 7025 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా వస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్షన్ 7025 చిప్‌సెట్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.

Also Read: ఫోన్ పోయిందా.. అయితే నిమిషాల్లో కనుక్కోవచ్చు!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్ కోసం 6000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. అయితే 8MP అల్ట్రావైడ్ సెన్సార్ అందుబాటులో ఉంటుంది. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 4G LTE, 3G, 2G, బ్లూటూత్ 5.1, NFC, Wi-Fi, GPS మరియు USB టైప్ C పోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. దీనికి మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ అందిస్తోంది. దీనికి IP52 రేటింగ్ కూడా లభిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News