E-Paper
Advertisement

Realme C100: మిడ్ రేంజ్ బడ్జెట్‌లో 2TB వరకు స్టోరేజ్, 7000mAh బ్యాటరీ ఫోన్.. రియల్‌మి C100 త్వరలో లాంచ్

Realme C100: మిడ్ రేంజ్ బడ్జెట్‌లో 2TB వరకు స్టోరేజ్, 7000mAh బ్యాటరీ ఫోన్.. రియల్‌మి C100 త్వరలో లాంచ్
Advertisement

Realme C100| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి C100 5G త్వరలో లాంచ్ కానుంది. అధికారిక ప్రకటన ముందే యూరప్ రిటైలర్ వెబ్‌సైట్‌లలో (Gomibo, Belsimpel) ఈ ఫోన్ లిస్టింగ్‌లు కనిపించాయి. ఇలాంటి లీక్‌లు సాధారణంగా లాంచ్ డేట్ కొన్ని రోజుల ముందు మాత్రమే వస్తాయి. స్పెసిఫికేషన్స్, ధరల వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వెల్లడయ్యాయి.

పెద్ద డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్

రియల్‌మి C100 5Gలో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండవచ్చు. రిజల్యూషన్ 1570*720 పిక్సెల్స్. ఇంత పెద్ద స్క్రీన్ వీడియోలు, గేమింగ్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది. రిపోర్టుల ప్రకారం.. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు. దీనివల్ల స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా స్మూత్‌గా కనిపిస్తాయి.

మీడియాటెక్ ప్రాసెసర్‌తో మంచి పర్‌ఫామెన్స్

Advertisement

ఈ ఫోన్ మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ చిప్‌సెట్‌తో వస్తుందని లీక్ అయింది. ఇది బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లకు సరిపడే ప్రాసెసర్. Mali G57 MC2 GPU ఉంటుంది. రోజువారీ ఉపయోగం, లైట్ గేమింగ్ సులభంగా చేయవచ్చు. 5G సపోర్ట్ కూడా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్

లిస్టింగ్ ప్రకారం.. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రన్ అవుతుంది. కొంత భాగంలో ColorOS 16 అని కూడా చెప్పారు. అయితే Realme ఫోన్లు సాధారణంగా Realme UIతో వస్తాయి. ఇది లిస్టింగ్ ఎర్రర్ కావచ్చు. అధికారిక లాంచ్ తర్వాత స్పష్టమవుతుంది.

ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు

Advertisement

ఈ ఫోన్ బిగినర్లకు అంటే తొలిసారి కొత్త ఫోన్ తీసుకునేవారికి, విద్యార్థులకు సరిపోతుంది. అందుకే 4GB ర్యామ్‌తో వస్తుంది. బేసిక్ యాప్స్, మల్టీటాస్కింగ్‌కు సరిపోతుంది. స్టోరేజ్ 128GB, 256GB ఆప్షన్లు ఉండవచ్చు. మైక్రో SD కార్డ్ స్లాట్ ఉండి 2TB వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.

కెమెరా సెటప్

వెనక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 10x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ ఉండవచ్చు. ముందు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బాగుంటుంది.

7000mAh పెద్ద బ్యాటరీ

ఈ ఫోన్ హైలైట్ దీని బ్యాటరీ. 7000mAh కెపాసిటీ ఉండవచ్చు. హెవీ యూజర్లు ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ ఉపయోగించవచ్చు. ఛార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ బాక్స్‌లో ఛార్జర్ కాంప్లిమెంటరీ ఉండొచ్చు.

కనెక్టివిటీ, ఎక్స్‌ట్రా ఫీచర్లు

డ్యూయల్-బ్యాండ్ Wi-Fi (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS సపోర్ట్ ఉంటాయి. సింగిల్ మోనో స్పీకర్ ఉంటుంది. MIL-STD-810H సర్టిఫికేషన్ ఉండటంతో డ్యూరబిలిటీ మంచిగా ఉంటుంది.

యూరప్‌లో ధర (అంచనా)

4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర €237 (భారత కరెన్సీలో సుమారు రూ.25,000). 4GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర €256 ( అంటే దాదాపు రూ.27,000). భారత్‌లో ధర ఇంకా తక్కువగా ఉండవచ్చు. మార్కెట్ బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Also Read:  డిగ్రీ పూర్తి చేసే సమయానికి మీ పిల్లాడి సంపాదన రూ.9.25 కోట్లు.. లేకుంటే ఫీజు రిఫండ్.. ఏఐ స్కూల్ హామీ

లాంచ్ ఎప్పుడు?

Realme ఇంకా అధికారికంగా లాంచ్ డేట్ చెప్పలేదు. కానీ రిటైలర్ లిస్టింగ్‌లు వచ్చాయి కాబట్టి త్వరలోనే లాంచ్ అవుతుందని అంచనా. అధికారిక ప్రకటన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. బడ్జెట్ 5G ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ కావచ్చు.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన స్మార్ట్‌ఫోన్ ధరలు.. కేవలం అంచనాలు మాత్రమే. ఫైనల్ ధర కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుంది. కావున అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×