E-Paper
Advertisement

Romantic Drama OTT : భార్య అందగత్తె… భర్త మాత్రం మరో మహిళతో… సినిమా ఉంటుంది మావా

Romantic Drama OTT : భార్య అందగత్తె… భర్త మాత్రం మరో మహిళతో… సినిమా ఉంటుంది మావా
Advertisement

Romantic Drama OTT : రొమాంటిక్ సినిమాలు మామూలుగానే క్రేజీగా ఉంటాయి. అయితే వీటిలో ట్రయాంగిల్ స్టోరీలు మరింత క్రేజీగా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక ఫిలిప్పీన్ మూవీ, ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. అందమైన భార్య ఉన్నా, ప్రియురాలు మోజులో పడే ఒక వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో భార్య, ప్రియురాలి మధ్య జరిగే మాటల యుద్ధం, డైలాగులు ఫిలిప్పీన్స్‌లో బాగా పాపులర్ అయ్యాయి కూడా.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సూపర్ హిట్ ఫిలిప్పీన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘నో అదర్ ఉమెన్’ (No Other Woman). ఎస్. బయాని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2011లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఫిలిప్పీన్స్ బాక్సాఫీస్ వద్ద అప్పట్లో ఒక సంచలనం. విడుదలైన కొద్ది రోజుల్లోనే సుమారు $7 మిలియన్ డాలర్లు వసూలు చేసి, ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ ఫిలిప్పీన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. 2011 సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆన్ కర్టిస్, డెరెక్ రామ్సే, క్రిస్టిన్ రేయ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మొత్తం 30 నామినేషన్లు దక్కాయి. ప్రముఖ FAMAS అవార్డ్స్ (2012) లో ఆన్ కర్టిస్ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. దర్శకుడు ఎస్. బయాని, నటులు డెరెక్ రామ్సే, క్రిస్టిన్ రేయ్స్ కూడా ఉత్తమ నటనకు గాను నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాను Netflix, Amazon Prime Video ప్లాట్‌ ఫామ్స్‌లో చూడవచ్చు

స్టోరీ ఏమిటంటే

Advertisement

రామ్ అనే వ్యక్తి ఒక ఫర్నిచర్ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అతనికి చార్మైన్ అనే అందమైన భార్య ఉంటుంది. ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలోకి కారా అనే ఒక రిచ్ అమ్మాయి ఎంటర్ అవుతుంది. రామ్ ఒక రోజు బిజినెస్ డీల్ కోసం ఆమెతో కలవాల్సి వస్తుంది. కారా చూడటానికి చాలా గ్లామరస్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. ఆమెకి రామ్ మీద కన్ను పడుతుంది. ఎలాగైనా అతన్ని పడేయాలని గట్టిగా డిసైడ్ అవుతుంది. మొదట్లో రామ్ కొంచెం మొహమాటపడ్డా, కారా వేసే వలకి మెల్లగా చిక్కుకుపోతాడు. ఆమె ఇచ్చే ఆఫర్లు, ఆమె చూపించే ఆకర్షణకి లోనై తన పెళ్ళాం ఉన్న సంగతి మర్చిపోయి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఈ విషయం ఇంట్లో ఉన్న భార్యకి అస్సలు తెలియదు.

వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్న టైంలో, మెల్లగా చార్మైన్‌కి తన భర్త ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. ఒకరోజు అసలు విషయం బయటపడటంతో ఇల్లు రచ్చ రచ్చ అవుతుంది. తన మొగుడిని వేరే ఆడది తగులుకుందని తెలిసిన చార్మైన్, అస్సలు తగ్గదు. నా మొగుడు నాకే కావాలని కారాకి ఎదురుతిరుగుతుంది. ఇద్దరు ఆడవాళ్ల మధ్య పెద్ద మాటల యుద్ధం నడుస్తుంది. ఒక పక్క భార్య ప్రేమ, ఇంకో పక్క ప్రియురాలి పిచ్చి – ఈ రెండిటి మధ్య రామ్ ఎలా నలిగిపోయాడు ? చివరకు తప్పు తెలుసుకుని తన సంసారాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : దీపావళి పండుగ మిడిల్ క్లాస్ మెమోరీస్ తో… లైఫ్ అంటే ఏంటో చూపించే చూడ చక్కని కథ

Tags

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×