E-Paper
Advertisement

Realme C65 5G Launched : కొత్త ఫోన్ లాంచ్.. రూ.10 వేలకే 50MP కెమెరా!

Realme C65 5G Launched : కొత్త ఫోన్ లాంచ్.. రూ.10 వేలకే 50MP కెమెరా!
Advertisement

Realme C65 5G Launched : చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ C65 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను రూ.10 వేల లోపు ధరకే తీసుకొచ్చింది రియల్ మీ. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాకుండా 50 MP డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. C65 5G స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు తదితర విషయాల గురించి తెలుసుకోండి.

రియల్ మీ C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 6.67-అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 625 nits పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఫోన్‌ MediaTek Dimensity 6300 6nm ప్రాసెసర్‌తో వస్తుంది. 6 GB RAM, 6 GB వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. ఫోన్‌లో  128 GB స్టోరేజ్ ఉంటుంది. ఇందులో మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.

Advertisement

Also Read : కిర్రాక్ ఆఫర్.. ఇలా కొంటే రూ.400లకే 5G స్మార్ట్‌ఫోన్!

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఇంటర్‌ఫేస్ RealmeUI 5.0పై నడుస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీని ఉంది. ఈ ఫోన్‌ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టవిటీ కోసం ఫోన్‌లో  5G NA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.1, GPS + GLONASS, USB టైప్-సి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

Advertisement

కెమెరా గురించి చెప్పాలంటే C65 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 MP కాగా 2 MP సెకండరీ కెమెరా సెన్సార్ అందించబడింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసంఈ ఫోన్ 8 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Realme C65 ధర చూస్తే.. 4 GB RAM +64 GB స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 10,499. 4 GB RAM + 128 GB స్టోరేజ్‌తో ఉన్న ఇతర వేరియంట్ ధర రూ.11,499. ఈ రెండు వేరియంట్‌లపై రూ. 500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తుంది.

Also Read : 108 MP కెమెరాతో అదిరిపోయే ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు వైరల్

6 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్‌తో ఫోన్ టాప్ వేరియంట్ రూ.12,499కి లాంచ్ చేశారు. ఈ మోడల్‌పై రూ. 1000 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఫోన్ మొదటి సేల ఆల్రడీ ప్రారంభం అయింది.

Tags

Related News

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×