BigTV English

Producer Gnanavel Raja: పనిమనిషి ఆత్మహత్యాయత్నం.. నిర్మాతపై కేసు నమోదు..?

Producer Gnanavel Raja: పనిమనిషి ఆత్మహత్యాయత్నం.. నిర్మాతపై కేసు నమోదు..?

Producer Gnanavel Raja: ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా ‘పరుత్తివీరన్’ సినిమాతో నిర్మాతగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’ మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ నిర్మతతో సహా ఆయన సతీమణి నేహాపై మాంబలం పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే మరి ఎందుకు కేసు నమోదు అయింది.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నిర్మాత జ్ఞానవేల్, నేహా దంపతులు చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని జగదీశ్వరన్ వీధిలో నివాసముంటున్నారు. ఇక అదే ఇంట్లో లక్ష్మీ అనే మహిళ పనిమనిషిగా ఉంటుంది. ఈ తరుణంలో కొద్దిరోజుల క్రితం వాళ్ల ఇంట్లో నగలు మాయమైనట్లు సమాచారం. దీంతో నిర్మాత భార్య నేహాకు పనిమనిషి లక్ష్మీపై అనుమానం వచ్చింది.

ఈ క్రమంలో ఒక రోజు ఇదే విషయమైన పనిమనిషి లక్ష్మీని నిలదీసింది నేహా. దీంతో లక్ష్మీ ఆ మరుసటి రోజు నుంచి వాళ్ల ఇంటికి పని చేయడానికి వెళ్లడం మానేసింది. అనంతరం లక్ష్మీకి ఫోన్ చేస్తే స్విఛాప్ వచ్చింది. దీంతో నేహాకు మరింత అనుమానం పెరిగింది. వెంటనే ఆమె తన భర్త నిర్మాత జ్ఞానవేల్ రాజాకు జరిగిన విషయం చెప్పింది. వెంటనే అతడు మాంబలం పోలీస్టేషన్‌లో నగలు మాయమైనట్లు ఫిర్యాదు చేశాడు.


Also Read: రేపు 4 గంటలకి గోదారోళ్ల వేట మామూలుగా ఉండదు..

ఇక ఆ ఫిర్యాదులో లక్ష్మీపై కూడా తమకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు లక్ష్మీని సంప్రదించి విచారించారు. అరంతరం లక్ష్మీ ఆ మరుసటి రోజు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో బంధువులు వెంటనే గమనించి ఆమెను రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలో పనిమనిషి లక్ష్మీ కుమార్తె.. జ్ఞానవేల్ రాజా, ఆయన సతీమణి నేహాపై మాంబలం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జ్ఞానవేల్ రాజా, నేహా తమ నగలను ఎక్కడో పారేసుకుని ఆ నిందను తన తల్లిపై మోపుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారని.. అందువల్ల నిర్మాత జ్ఞానవేల్, నేహాతో పాటు కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. దీంతో ఇప్పుడీ వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×