Big Stories

Infinix GT 20 Pro : 108 MP కెమెరాతో అదిరిపోయే ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు వైరల్

Infinix GT 20 Pro : ప్రపంచ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. రోజులు గడిచే కొద్ది కొత్తకొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ తన బ్రాండ్ నుంచి ఫోన్‌ను తీసుకురానుంది. జీ 20 ప్రోని విడుదల  చేసింది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 12GB RAM, 108MP కెమెరాతో మే 2న మలేషియాలో విడుదల కానుంది. ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

Infinix కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix GT 20 Pro మే 2న మలేషియాలో లాంచ్ చేయనుంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోెన్ త్వరలో భారత్ మార్కెట్‌లో కూడా త్వరలోనే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా Infinix GT 20 Pro అన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు దాని లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. ఫోన్ మిడ్ రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మలేషియాలో Infinix GT 20 Pro ధర దాదాపు రూ. 22,640 ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read : ఐక్యూ లవర్స్‌కు పండగే.. మూడు ఫోన్లు లాంచ్!

ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో రానుంది. ఇందులో మెకా సిల్వర్, మెకా బ్లూ, మెకా ఆరెంజ్ ఉన్నాయి. అయితే కంపెనీ రిలీజ్ చేసిన టీజర్‌లో ఫోన్ వెనుక భాగంలో C ఆకారపు RGB లైటింగ్‌ను కలిగి ఉంటుంది. సమాచారం ప్రకారం రాబోయే Infinix ఫోన్ 6.78 అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేటును అందిస్తుంది.

అంతే కాకుండా ఫోన్‌లో ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. బెస్ట్ గేమింగ్ కోసం  JBL  డ్యూయల్ స్పీకర్లు ఫోన్‌లో ఉంటాయి. ఫోన్ IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అంటే ఫోన్‌ను వాటర్, డస్ట్‌ను రక్షించుకోవచ్చు. MediaTek డైమెన్షన్ 8200 అల్టిమేట్ చిప్‌సెట్ Infinix GT 20 Proపై వస్తుంది. ఇది 8 GB, 12 GB RAM ఎంపికలలో రావచ్చు. 256 GB  స్టోరేజ్ ఉంటుంది.

Also Read : హెచ్ఎమ్‌డీ నుంచి మూడు క్లాసిక్ ఫోన్లు.. ఎంత చీప్ అంటే!

ఇక ఫోన్ పవర్ విషయానికి వస్తే 5000 mAh బిగ్ బ్యాటరీతో 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్లో 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఇందులో 2 ఎంపీ యాక్సిలరీ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్ Android 14 OSలో రన్ అవుతుంది. దానిపై Infinix XOS 14 UI లేయర్ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News