E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మీ నార్జో 90 vs వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ vs వివో Y39.. ఏది బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మీ నార్జో 90 vs వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ vs వివో Y39.. ఏది బెస్ట్?
Advertisement

Realme Narzo 90 5G vs Vivo Y39 5G vs OnePlus Nord CE4 Lite 5G Comparison| రియల్‌మీ ఇటీవల భారత్‌లో నార్జో 90 5Gను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు వివో Y39 5G, వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G ఫోన్లు గట్టి పోటీనిస్తున్నాయి. మూడు ఫోన్‌లు బడ్జెట్, మిడ్-రేంజ్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తాయి. పనితీరు, డిస్‌ప్లే, బ్యాటరీలో ప్రతి ఒక్కటి భిన్నమైన బలాలు కలిగి ఉన్నాయి. ఈ పోలిక మీకు బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవడానికి సహాయపడుతుంది.

ధరల పోలిక

రియల్‌మీ నార్జో 90 5G రెండు వేరియంట్లలో వచ్చింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.18,499. వివో Y39 5Gలో ఒకే వేరియంట్ (8GB RAM + 128GB స్టోరేజ్) ఉంది. దీని ధర రూ.16,999. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G (8GB RAM + 128GB స్టోరేజ్) ధర రూ.17,999.

డిస్‌ప్లే ఫీచర్లు

Advertisement

రియల్‌మీ నార్జో 90 5Gలో 6.57 అంగుళాల AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.
వివో Y39 5Gలో 6.68 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5Gలో 6.67 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

రియల్‌మీ నార్జో 90 5Gలో భారీ 7000mAh బ్యాటరీ ఉంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. వివో Y39 5Gలో 6500mAh బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5Gలో 5500mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియనస్

Advertisement

రియల్‌మీ నార్జో 90 5G ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. రియల్‌మీ UI 6.0 ఇంటర్‌ఫేస్. వివో Y39 5G కూడా ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఫన్‌టచ్ OS 15 ఉంది. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఆక్సిజన్ OS 14 ఇంటర్‌ఫేస్.

ప్రాసెసర్, పనితీరు

రియల్‌మీ నార్జో 90 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మాక్స్ చిప్‌సెట్ ఉంది. 6nm ఆర్కిటెక్చర్. వివో Y39 5Gలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఉంది. పవర్ ఎఫిషియెంట్ 4nm ప్రాసెస్. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5Gలో స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంది. 6nm మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్.

Also Read: ఒక్క రోజులోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోతారు.. యాడ్స్ అవసరం లేదు.. ఎలాగంటే

కెమెరా కెపాసిటీ

రియల్‌మీ నార్జో 90 5Gలో 50MP ప్రధాన రియర్ కెమెరా ఉంది. 2MP మోనోక్రోమ్ సెన్సార్. 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
వివో Y39 5Gలో 50MP మెయిన్ రియర్ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5Gలో 50MP సోనీ LYT-600 ప్రధాన కెమెరా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. 2MP డెప్త్ సెన్సార్, తో పాటు 16MP ఫ్రంట్ కెమెరా ఉది.

కనెక్టివిటీ ఆప్షన్లు 

రియల్‌మీ నార్జో 90 5Gలో 5G కనెక్టివిటీ ఉంది. బ్లూటూత్ 5.3, వై-ఫై 5 సపోర్ట్. వివో Y39 5Gలో డ్యూయల్ సిమ్, 5G సపోర్ట్. బ్లూటూత్ 5.0, స్టాండర్డ్ వై-ఫై. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5Gలో 5G SA, NSA సపోర్ట్. వై-ఫై 6, బ్లూటూత్ 5.2, 3.5mm ఆడియో జాక్.

ఫైనల్ విన్నర్ ఎవరు?

రియల్‌మీ నార్జో 90 5G బలమైన బ్యాటరీ లైఫ్, షార్ప్ AMOLED డిస్‌ప్లే ఇస్తుంది. వివో Y39 5G ఎఫిషియెన్సీ, బడ్జెట్ ధరపై దృష్టి పెడుతుంది. వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G ప్రీమియం డిస్‌ప్లే బ్రైట్‌నెస్, ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తుంది. మీ అవసరాన్ని బట్టి కొనుగోలు చేయండి.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×