2026 T20 World Cup: 2026 టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ టీమిండియాని ప్రకటించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్ టోర్నీలో.. సూర్య సేన ఎలా ఆడబోతోంది? మరోసారి వరల్డ్ కప్ గెలిచేందుకు.. టీమిండియా దగ్గరున్న అవకాశాలేంటి? బీసీసీఐ ప్రకటించిన టీమ్.. ప్రత్యర్థి జట్లని ఎలా ఎదుర్కోబోతోంది? అసలు.. మనోళ్ల గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? సొంతగడ్డపై జగజ్జేతగా నిలిచేందుకు టీమిండియా సిద్ధంగా ఉందా?
2026 టీ20 ప్రపంచకప్ కోసం.. బీసీసీఐ టీమిండియాను అధికారికంగా ప్రకటించింది. భారత్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మరోసారి ఛాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా.. సెలక్షన్ కమిటీ.. పటిష్టమైన జట్టుని ఎంపిక చేసింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో.. భారత జట్టు ప్రపంచకప్ బరిలో దిగనుంది. ఇక.. శుభ్‌మన్ గిల్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో సెలక్టర్లు పక్కనపెట్టారు. గిల్ స్థానంలో అక్షర్ పటేల్‌ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హోమ్ అడ్వాంటేజ్‌తో.. టీమిండియా టైటిల్ డిఫెండ్ చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. సూర్యకుమార్ సారథ్యంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌తో పాటు టీమ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివవ్ దూబే, రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ ఉన్నారు. వీరిలో.. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ని ఎంపిక చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఇషాన్ కిషన్‌ని మళ్లీ టీమ్‌లోకి తీసుకున్నారు.
టీమిండియా టీ20 వరల్డ్‌కప్ టీమ్.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్లలో బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. పవర్ ప్లేలో విరుచుకుపడే ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్‌లో మెరిసిపోయే హిట్టర్లు, మ్యాచ్‌ని అద్భుతంగా ఫినిష్ చేసే ప్లేయర్లంతా.. ఐసీసీ మెగా టోర్నీలో మెరవనున్నారు. బుమ్రా లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ సహా కొత్త బంతిని కూడా అద్భుతంగా స్వింగ్ చేయగలిగే హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ లాంటి బౌలర్లు ఉన్నారు. తమ వేగంతో ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సెలక్టర్లు ఈసారి.. 8, 9వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లపై దృష్టిసారించారు. మ్యాచ్ ప్రెజర్‌కి వచ్చినప్పుడు.. వీళ్లే జట్టుకు కొండంత అండగా నిలవనున్నారు.
వచ్చే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫియర్ లెస్ గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. గత టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత.. భారత్ సరికొత్త పంథాను అనుసరిస్తోంది. యంగ్ ఓపెనర్ల ద్వారా.. పవర్ ప్లేలో విధ్వంసకరమైన బ్యాటింగ్ ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది. ఓపెనర్లతో.. మొదటి ఆరు ఓవర్లలోనే.. ప్రత్యర్థిపై విరుచుకుపడటమే మన ప్రధాన అస్త్రంగా ఉండబోతోంది. ఇక.. భారత పిచ్‌లపై స్పిన్నర్లతో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా గేమ్‌ని మలుపు తిప్పగల మిడిల్ ఆర్డర్ ఇప్పుడు బలంగా ఉంది. రాబోయే మెగా టోర్నీలో.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా లాంటి జట్ల నుంచి.. టీమిండియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే.. ఈసారి సొంత గడ్డపై వరల్డ్ కప్ టోర్నీ జరగడం టీమిండియాకు.. అతిపెద్ద సానుకూల అంశం. టీమ్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లకు తోడు.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్ లాంటి యంగ్ ప్లేయర్లు తోడవడం.. టీమ్‌ని మరింత పటిష్టంగా మార్చింది. టీ20 స్పెషలిస్ట్ అయిన సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలు, ఫీల్డ్ సెట్టింగ్స్ లాంటివన్నీ.. ఈ టోర్నీలో కీలకం కానున్నాయి.
బీసీసీఐ టీమ్ సెలక్షన్ చూశాక.. రాబోయే మెగా టోర్నీలో టీమిండియా పవర్ హిట్టింగ్ చూస్తామంటున్నారు. ముఖ్యంగా.. హోమ్ కండీషన్స్‌లో స్పిన్-పేస్ కాంబోతో భారత్ చెలరేగనుంది. బ్యాటింగ్‌లో తొలి ఆరు ఓవర్లలో.. 60కి పైగా రన్స్ రాబట్టడమే లక్ష్యంగా గేమ్ ఆడనున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లతో ప్రత్యర్థులని తిప్పలుపెట్టి.. డెత్ ఓవర్లలో పేసర్లతో కట్టడి చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇక.. ఆల్ రౌండర్లు ఎలాగూ ఉంటారు. న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లోనూ.. ఇదే టీమ్ ఆడనుందని బీసీసీఐ ప్రకటించింది. అందువల్ల.. వరల్డ్‌కప్ టోర్నీకి ముందే.. న్యూజిలాండ్ సిరీస్‌తో మనోళ్లు ప్రీ-టోర్నీ ప్రాక్టీస్ చేసి.. వరల్డ్‌కప్ మొదలయ్యే నాటికి ఫామ్ సెట్ చేసుకుంటారు. లీగ్ దశ నుంచే టీమిండియా గేమ్ అటాకింగ్‌గా ఉండబోతోంది. స్పిన్ డామినేషన్ సహా.. అన్ని విధాలుగా ప్రత్యర్థి టీమ్‌లను కౌంటర్ చేసేందుకు రెడీఅయ్యారు మన కుర్రాళ్లు.
2026 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో.. టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పైగా.. హోమ్ అడ్వాంటేజ్ ఉండనే ఉంది. స్టార్ ప్లేయర్లంతా ఫామ్‌లోనే ఉన్నారు కాబట్టి.. సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువ ఉన్నాయ్. గత టైటిల్ విక్టరీ ఇచ్చిన బూస్ట్, సూర్యకుమార్ సారథ్యంతో సెమీస్ దాకా చేరడం పెద్ద మ్యాటరేమీ కాదు. కానీ.. మధ్యలో గాయాలు, అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌ల్లో ఉండే ప్రెజర్‌తోనే.. కొన్ని రిస్క్‌లు ముడిపడి ఉన్నాయ్. ఏదేమైనా.. ఒత్తిడిని అధిగమించి మరోసారి ట్రోఫీ లిఫ్ట్ చేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది. ఈ మెగా టోర్నీలో.. కుర్రాళ్లు తమ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానుల ఆశలను నెరవేర్చి.. మరోసారి ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది. నిజానికి.. వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. టీమ్‌ని ఇప్పుడే ప్రకటించినా.. టోర్నీ మొదలయ్యే రోజు వరకు మార్పులు చేసే అవకాశం ఆతిథ్య హోదాలో భారత్‌కు ఉంది.
టీ20 వరల్డ్‌కప్ మొదలవడానికి 50 రోజుల ముందే.. టీమిండియాని ప్రకటించేసింది బీసీసీఐ. అమెరికా, వెస్టిండీస్ గడ్డపై నిర్వహించిన గత వరల్డ్‌కప్‌లో.. భారత్ విజేతగా నిలిచింది. ఈసారి.. టీ20 వరల్డ్‌కప్ హోస్ట్ ఇండియానే! మరి.. స్వదేశంలో జరగబోయే ప్రపంచకప్ టోర్నీలో.. భారత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? వరుసగా రెండోసారి కూడా ఛాంపియన్‌గా అవతరించే అవకాశం ఉందా? సొంత గడ్డ మీద వరల్డ్ కప్ లిఫ్ట్ చేయాలంటే.. టీమిండియా ఏం చేయాలి?
క్రికెట్ వరల్డ్‌లో అత్యంత ఉత్సాహభరితమైన సమయం ఆసన్నమైంది. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు.. భారత్ ఆతిథ్యమిస్తుండటంతో.. క్రికెట్ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయ్. ఈసారి టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. గత టోర్నీలో అమెరికా, వెస్టిండీస్ గడ్డపై సాధించిన అద్భుత విజయాన్ని.. ఈసారి సొంత గడ్డపై రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. టోర్నీకి 50 రోజుల ముందే బీసీసీఐ టీమిండియాని ప్రకటించడం చూస్తుంటే.. ప్రపంచకప్ గెలవాలనే కసి ఎంతుందో కనిపిస్తోంది. వరల్డ్ కప్ టీమ్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు దూకుడుగా దూసుకెళ్లిపోయే ప్లేయర్లని సెలక్ట్ చేయడం మరో బిగ్ ప్లస్ పాయింట్. భారత్ హోస్ట్‌గా ఉన్న ఈ మెగా టోర్నీ.. వచ్చే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రకటించిన భారత జట్టు.. ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. టాప్ ఆర్డర్‌లో ఉన్న యంగ్ ప్లేయర్లు పవర్ ప్లేలో మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ లాంటి ప్లేయర్లు.. ఇన్నింగ్స్‌ని నిలబెట్టేందుకు నిలకడగా ఆడతారనిపిస్తోంది. ఇక.. నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్‍తో కూడిన మిడిల్ ఆర్డర్.. ప్రత్యర్థి దేశాల జట్లని టెన్షన్ పెట్టేలా ఉంది. బౌలింగ్‌లో.. జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దళం, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిల స్పిన్ మ్యాజిక్.. భారత పిచ్‌లపై కీలకం కానున్నాయి. ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నల్లా ఒక్కటే.. సొంతగడ్డపై టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతోంది? అని! గత గణాంకాలను పరిశీలిస్తే.. భారత్ సొంతగడ్డపై ఎప్పుడూ బలమైన టీమ్‌గానే ఉంది. మన పిచ్‌లు, వాతావరణంపై.. టీమిండియా ప్లేయర్లకు పూర్తిస్థాయి అవగాహన ఉండటం.. మరో కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం.. భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. టీ20 ఫార్మాట్‌లో ఏ ఒకరో, ఇద్దరో ప్లేయర్లు మెరిస్తే సరిపోదు. టీమ్ మొత్తం సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఊపు, ప్రస్తుతం టీమ్‌లో ఉన్న బ్యాలెన్స్ చూస్తుంటే.. భారత్ మళ్లీ టైటిల్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలవాలంటే.. కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే చర్చ సాగుతోంది. మన పిచ్‌లు.. స్పిన్నర్లకు అనుకూలం. కుల్దీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి లాంటి వారు.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగలిగితే.. ప్రత్యర్థిని సులువుగా కట్టడి చేయొచ్చు. ఇప్పుడు నడుస్తున్న టీ20 క్రికెట్ ట్రెండ్‌లో.. పవర్ ప్లే స్కోరే అత్యంత కీలకం. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ గనక.. తొలి ఆరు ఓవర్లలోనే.. 60కి పైగా భారీ స్కోరు సాధిస్తే.. మిడిల్ ఆర్డర్‌పై ప్రెజర్ తగ్గుతుంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు.. దూకుడుగా ఆడేందుకు వీలవుతుంది.
ఈ మెగా టోర్నీలో బుమ్రా ఫ్యాక్టరీ మరింత కీలకం. జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్, అతని డెత్ ఓవర్ల బౌలింగ్.. భారత్‌కు అత్యంత కీలకం. అతను.. తన స్పెల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. కీలక వికెట్లు తీయగలిగితే.. సగం విజయం భారత్‌కు దక్కినట్లే. వీటన్నింటికంటే.. ప్రెజర్‌ని ఓవర్‌కమ్ చేయడం ముఖ్యం. సొంతగడ్డపై.. వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్నప్పుడు.. అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయ్. అందువల్ల.. గతంలో జరిగినవన్నీ మర్చిపోయి.. ప్రశాంతంగా ఫీల్డ్ మీద రాణించగలగాలి. ప్రతి మ్యాచ్‌లోనూ.. ఫినిషింగ్ టచ్ అదిరిపోవాలి. హార్డ్ హిట్టర్లు.. ఆఖరి ఓవర్లలో మ్యాచ్‌ని టర్న్ చేసేలా ఆడాలి. విజయంతో ముగించే బాధ్యత తీసుకోవాలి. బీసీసీఐ ప్రకటించిన టీమిండియాలో.. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు కొదువ లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ని ఎంచుకొని.. గ్రౌండ్‌లో పక్కాగా వ్యూహాలను అమలు చేస్తే.. భారత్ ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్‌కప్‌ని చేతుల్లోకి తీసుకోవడం ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
Story By Anup, Big Tv