Realme Narzo 90 vs Galaxy F36 5G vs Moto G96 Smartphone Comparison| రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇటీవల భారత్‌లో రియల్‌మీ నార్జో 90 5G లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు పోటీగా ఇదే ధరలో శాంసంగ్ గెలాక్సీ F36 5G, మోటో G96 5G ఉన్నాయి. మూడు ఫోన్లు మిడ్-రేంజ్ ధరలో ఉన్నాయి. మూడు ఫోన్లు కూడా 5G సపోర్ట్, ఆధునిక ఫీచర్లు కలిగి ఉన్నాయి. మిడ్ రేంజ్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ మూడు ఫోన్ల ఫీచర్లు ముందుగా పోల్చి నిర్ణయం తీసుకోండి.
రియల్‌మీ నార్జో 90 5G.. 6GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.16,999. 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.18,499.
శాంసంగ్ గెలాక్సీ F36 5G కూడా అదే ధరలో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, 8GB ర్యామ్ + 128GB ధర రూ.18,499.
మోటో G96 5G ఒకే వేరియంట్‌తో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB ధర రూ.18,119.
మోటో ఫోన్ ధర పరంగా బెటర్.
రియల్‌మీ నార్జో 90 5Gకి 6.57 ఇంచ్ Full HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1080*2372, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ట బ్రైట్‌నెస్ 1,400 నిట్స్.
శాంసంగ్ గెలాక్సీ F36 5Gలో 6.7 ఇంచ్ FHD+ Super AMOLED డిస్‌ప్లే ఉంది. 1080*2340 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్.
మోటో G96 5Gకి 6.67 ఇంచ్ 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ బ్రైట్‌నెస్.
డిస్‌ప్లే విషయంలో మోటో ఆధిక్యంలో ఉంది.
రియల్‌మీ నార్జో 90 5Gలో 7,000mAh పెద్ద బ్యాటరీ, 60W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F36 5Gలో 5,000mAh బ్యాటరీ, 25W చార్జింగ్ సపోర్ట్ ఉంది.
మోటో G96 5Gలో 5,500mAh బ్యాటరీ, 33W టర్బోపవర్ చార్జింగ్.
బ్యాటరీ కెపాసిటీలో రియల్‌మీ చాలా ముందుంది.
మూడు ఫోన్ల కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అవుతాయి.
రియల్‌మీ నార్జో 90 5G లో Realme UI 6.0 వెర్షన్ ఉండగా.. శాంసంగ్ గెలాక్సీ F36 5Gలో One UI 7 ఉంది. అలాగే మోటో G96 5Gలో Hello UI సాఫ్ట్‌వేర్ ఉంది.
మీకు ఏది ఇష్టమో అదే తీసుకోండి. మూడు దాదాపు సమానమే.
రియల్‌మీ నార్జో 90 5Gలో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ చిప్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ F36 5Gలో ఎక్సినోస్ 1380 చిప్ ఉంది.
కానీ మోటో G96 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంది.
స్నాప్‌డ్రాగన్ బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. హెవీ గేమింగ్ చేసేవారికి స్నాప్‌డ్రాగన్ బెస్ట్.
రియల్‌మీ నార్జో 90 5Gలో 50MP మెయిన్ + 2MP మోనోక్రోమ్, 50MP సెల్ఫీ కెమెరా లెన్స్‌లున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ F36 5Gలో 50MP (OIS) + 8MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో, 13MP సెల్ఫీ కెమెరాలున్నాయి.
మోటో G96 5G – 50MP (OIS) + 8MP అల్ట్రా-వైడ్, 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
సెల్ఫీల కోసం రియల్‌మీ బెస్ట్. కానీ శాంసంగ్ రియర్ కెమెరాల్లో ఎక్కువ వెరైటీ ఇస్తుంది.
మూడు ఫోన్లలో 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB Type-C ఉన్నాయి.
రియల్‌మీలో బ్లూటూత్ 5.3, శాంసంగ్‌లో డ్యూయల్ 4G VoLTE, మోటోలో బ్లూటూత్ 5.2 ఉన్నాయి.
Also Read: హోమ్ ప్రొజెక్టర్లకు పెరుగుతున్న డిమాండ్.. స్మార్ట్‌టివి లేదా ప్రొజెక్టర్ ఏది కొనడం బెస్ట్?
పెద్ద బ్యాటరీ కావాలంటే రియల్‌మీ నార్జో 90 5G బెస్ట్.
మంచి రియర్ కెమెరాలు కావాలంటే శాంసంగ్ గెలాక్సీ F36 5G లో ఎంచుకోండి.
స్మూత్ డిస్‌ప్లే, బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్ కోసం మోటో G96 5G బెటర్ ఆప్షన్.
మీ అవసరాలను బట్టి ఎంచుకోండి.