E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 4th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచనకు నిజం చెప్పిన పారిజాతం

Karthika Deepam 2 Serial Today march 4th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచనకు నిజం చెప్పిన పారిజాతం
Advertisement

Karthika Deepam 2  serial today Episode:   

కార్తీక్, దశరథ మాట్లాడుకోవడం చాటు నుంచి వింటుంది పారిజాతం. బిడ్డను వదులుకోవడం తప్ప ఈ సమస్యకు మరో పరిష్కారం లేదని దశరథ కు కార్తీక్‌ చెప్పడం మొత్తం పారిజాతం వింటుంది. వెంటనే ఈ విషయం కాంచనకు చెప్పాలని అక్కడి నుంచి వెళ్లిపోతుంది పారిజాతం.

మరోవైపు స్వప్నకు యాపిల్‌ తినిపిస్తుంటాడు శ్రీధర్‌ అది చూసిన కావేరి కోపంగా చూస్తూ.. భర్తతో విడిపోయిన కూతురికి బుద్ది చెప్పాల్సింది పోయి మీరు సమర్థిస్తున్నారా..? అంటూ తిట్టి వెళ్లిపోతుంది. దీంతో స్వప్న అనుమానంగా నాన్న అమ్మకు నా మీద కోపంగా ఉంది. మరి మీకు కోపం లేదా..? అని అడుగుతుంది. దీంతో  మీ అమ్మకు నీ మీద కోపం కాదమ్మ.. బాధ.. తన కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో? నలుగురు ఏమనుకుంటారో అని బాధపడుతుంది. ఇక నేను కాశీ గురించో , మీ అమ్మ గురించో, దాస్ గురించో ఆలోచించడం లేదు.

Advertisement

ఎందుకంటే నా కూతురికి నేను ధైర్యంలా.. ఆమె ముఖం మీద నవ్వులా ఉండాలనుకున్నాను.. వివాహ బంధాన్ని ఎవ్వరూ కావాలని వదులుకోరు.. ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు.. నచ్చలేదని వదిలేసుకుంటున్నావు. అందరిలాగే నేను కూడా తిట్టి బాధపెడితే వాళ్లకి నాకు తేడా ఏముంటుంది.. అంటూ శ్రీధర్‌ చెప్పగానే.. స్వప్న ఎమోషనల్‌ అవుతూ శ్రీధర్‌ను హగ్‌ చేసుకుంటుంది. నన్ను ఇంతగా అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్స్ నాన్న.. నువ్వెప్పుడూ నా హీరోవే అంటుంది. శ్రీధర్‌ మాత్రం సున్నితంగా జీవితంలో ఏం పోయినా తిరిగొస్తుంది.. కానీ జీవితం పోతే తిరిగిరాదు అంటాడు.

మరోవైపు ఇంట్లోకి వెళ్లిన పారిజాతం కాంచనకు ఫోన్‌ చేసి నీకొక నిజం చెప్పాలి. ఆ నిజం చెబితే నీకు నిద్ర పట్టదు అనగానే.. నువ్వు చెప్పకపోయినా నిద్రపట్టదు.. ఎందుకంటే నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అని రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోతాను అంటుంది కాంచన. అందరూ ఇబ్బంది పడకూడదనే ఉంది. కానీ గొడవలు అవుతాయని ఆలోచిస్తున్నాను.. అంటుంది పారిజాతం. దీంతో కాంచన అసలు నీకెం తెలుసు? నాతో ఏం చెప్పాలి.. దాని వల్ల ఏం గొడవలు అవుతాయి.. అని అడగ్గానే.. నువ్వు నీ కోడలి గురించి, పుట్టబోయే బిడ్డ గురించి గంపెడు ఆశలు పెట్టుకున్నావు.. వాటిలో ఏ ఒక్కటి నిజం కాదని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? నీ కోడలు కడుపు వద్దనుకుంటుంది. అని చెప్పగానే.. కాంచన షాక్‌ అవుతుంది. నీ కొడుకు, కోడలు నీ అన్న.. ముగ్గురు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్పగానే..

Advertisement

కట్‌ చేస్తే కార్తీక్‌తో దీప అదే విషయం మాట్లాడుతుంది. కాంచనకు విషయం తెలస్తే అసలు ఒప్పుకోదని చిన్న అనుమానం వచ్చినా మనల్ని బయటకు కూడా వెళ్లనివ్వదని చెప్తుంది. అమ్మకు నమ్మెలా నేను చెప్తానని ఏదిఏమైనా నువ్వు హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అవుతావని చెప్తాడు కార్తీక్‌. తర్వాత దాస్‌ను కలిసి దశరథ అసలు నిజం చెప్తాడు. సుమిత్రను కాపాడుకోవడం కోసం నీ కూతురు త్యాగం చేస్తుందని కానీ దీప కడుపులో పెరుగుతున్న నా మనవరాలిని ఎవరు రక్షిస్తారని అంటాడు దశరథ మాటలకు దాస్‌ షాక్‌ అవుతాడు. దీప గురించి దాస్‌ బాధపడతాడు. దీప పుట్టడంతోనే కష్టాలు అనుభవిస్తే.. దీప బిడ్డకు కడుపులోనే కష్టాలు మొదలయ్యాయని ఎమోషనల్ అవుతాడు దాస్‌.

మరోవైపు కాంచన, దీప విషయం అనసూయ శ్రీధర్‌కు చెప్తుంది. ఎవరు చెప్పారని వాళ్లు అడగ్గానే.. పారిజాతం చెప్పిందని చెప్తుంది కాంచన. ఆమె మాటలు నమ్మొద్దని అంటారు శ్రీధర్‌, అనసూయలు. ఇంతలో కార్తీక్‌, దీప లగేజీ తీసుకుని రూంలోంచి బయటకు రాగానే.. కాంచన షాక్‌ అవుతుంది. నా దగ్గర ఎందుకు నిజం దాచారని అడుగుతుంది. దీంతో కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×