E-Paper
Advertisement

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!
Advertisement

Realme P2 Pro 5G sale today: చైనీస్ టెక్ బ్రాండ్ రియల్‌మి ఇటీవలే తన లైనప్‌లో ఉన్న రియల్‌మి పి2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆకట్టుకునే అధునాతన ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. రిలీజ్ అయిన అనంతరం ఈ ఫోన్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఎప్పుడెప్పుడు ఈ ఫోన్ సేల్‌కు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ సేల్‌కు మరికొద్ది గంటలే సమయం ఉంది.

ఇవాళ సాయంత్రం రియల్‌మి పి2 ప్రో 5జీ ఫోన్ సేల్ షురూ కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య దీనిని కొనుక్కోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్‌లో ఈ ఫోన్‌ అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Advertisement

Realme P2 Pro 5G Specifications

రియల్‌మి పి2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల ఎఫహెచ్‌డీ ప్లస్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అదే సమయంలో 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెచ్‌జెడ్ పిడబ్లూఎం డిమ్మింగ్‌ను కలిగి ఉంది. అలాగే 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వచ్చింది.

Advertisement

ఇక దీని ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ ఎస్ఓసీ చిప్‌సెట్ అందించారు. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి యుఐ 5.0 ఓఎస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు విసి కూలింగ్ సిస్టమ్ కూడా అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో ఐఓఎస్‌ ఫీచర్‌తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 32ఎంపీ కెమెరాను కలిగి ఉంది. దీనికి తోడు ఏఐ ఫీచర్లు సైతం ఇందులో అందించబడ్డాయి.

Also Read: కొత్త ఫోన్ లాంచ్.. రూ.10,000 లకే పొందొచ్చు, ఫీచర్లు బాగున్నాయ్!

ఏఐ గేమింగ్ ఐ ప్రొటెక్షన్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, ఏఐ గ్రూప్ ఫోటో, ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ పోర్ట్రియిట్ వంటి అనేక ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫోన్ సామర్థ్యం గురించి మాట్లాడితే.. 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో అద్భుతమైన, అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి.

Realme P2 Pro 5G Price

ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. అదే సమయంలో 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. అలాగే టాప్ రేంజ్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను కంపెనీ రూ.27,999గా నిర్ణయించింది.

ఎర్లీ బడ్ సేల్

అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య జరగనున్న ‘ఎర్లీ బడ్ సేల్’లో దీనిని మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భారీ ఆఫర్లు ఉన్నాయి. అందులో ఈ మూడు వేరియంట్లపై దాదాపు రూ.2,000 తగ్గింపు అందుబాటులో ఉంది. అదే సమయంలో 12జీబీ ర్యామ్ /256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్/ 512జీబీ స్టోరేజ్ వేరియంట్లపై మరో రూ.1000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ తగ్గింపు తర్వాత ఈ ఫోన్లు మరింత తక్కువ ధరకే లభిస్తాయి. కాగా ఇవి పేరెట్ గ్రీన్, ఈగల్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×