BigTV English

Joni Master : ఆధారాలు వుంటే శిక్షించండి.. నోరు విప్పిన జానీ మాస్టర్.. వారి గుట్టు రట్టు..!

Joni Master : ఆధారాలు వుంటే శిక్షించండి.. నోరు విప్పిన జానీ మాస్టర్.. వారి గుట్టు రట్టు..!

Johnny Master.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి దిగ్గజ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ (Johnny master)తాజాగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మరో మహిళ కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధించాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని డిమాండ్ చేశారని, ఆమె రాయదుర్గం పోలీసుల ముందు తనకు జరిగిన నష్టాన్ని వివరించింది. అయితే ఈ ఘటన నార్సింగి పరిధిలోకి రావడంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ ను అక్కడికి తరలించగా అక్కడ సీఐ హరికృష్ణ రెడ్డి ఈయనపై కేసు నమోదు చేశారు.


జానీ మాస్టర్ పై ఎఫ్ ఐ ఆర్ కేస్ ఫైల్.

షూటింగ్లో భాగంగా అవుట్ డోర్ కి వెళ్ళినప్పుడు హైదరాబాద్, చెన్నై, ముంబై తో సహ నార్సింగి లోని తన నివాసంలో కూడా జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, బహిరంగంగా దుర్భాషలాడాడని, క్యారవాన్ లో కూడా లైంగిక దాడి చేశాడంటూ చెప్పుకొచ్చింది. విచారణ జరిపిన తర్వాత జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 506 ( క్రిమినల్ బెదిరింపులు), సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) క్లాజ్ 2 ఎన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.


3 గంటలపాటు బాధిత యువతిని విచారించిన పోలీసులు..

ముఖ్యంగా మహిళా కొరియోగ్రాఫర్ కూడా మీడియా ముందుకు పోలీసులు ముందుకు రాలేనని చెప్పడంతో నార్సింగిలోని ఆమె నివాసంలో పోలీసులు దాదాపు మూడు గంటల పాటు ఆమెను విచారించగా, ఇలా విస్తుపోయే నిజాలు ఆమె బయట పెట్టింది. ఇకపోతే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తూ జానీ మాస్టర్ పై సస్పెండ్ విధించింది. ఇదిలా ఉండగా ఈ వివాదం పై తాజా మాస్టర్ స్పందించారు.

నోరు విప్పిన జానీ మాస్టర్..

మీడియా ముందుకు వచ్చిన జానీ మాస్టర్ కుట్రపూరితంగానే తనను ఇరికించారని స్పష్టం చేశారు. యూనియన్ గొడవల్లో భాగంగా కొంతమంది ఆ మహిళలతో నాపై కేసు పెట్టించారు. ఆధారాలు అంటే నన్ను శిక్షించండి అందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆమెకు డబ్బులు ఇచ్చి ఇలా నాపై కేసు పెట్టించి, నా పరువు మర్యాదలు పోగొడుతున్నారు. గతంలో ఆమె నా దగ్గర పని చేసిన విషయం వాస్తవమే కానీ ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నాన్ మెంబర్స్ పనిచేస్తున్నారని నేను ప్రశ్నించినందుకు ఇలా నన్ను ఈ కేసులో ఇరికించారు అంటూ జానీ మాస్టర్ తెలిపారు.

Johnny Master: finally who opened his mouth. including their names also..!
Johnny Master: finally who opened his mouth. including their names also..!

ఫైర్ అవుతున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా..

అయితే ఇదే విషయంపై జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా స్పందించింది. నాన్ యూనియన్ మెంబర్స్ పనిచేస్తున్నారని తెలిసి, జానీ మాస్టర్ సెట్స్ కి వెళ్లి అక్కడున్న కెమెరామెన్ తో ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నాన్ మెంబర్ తో పని చేయించుకుంటే కార్డు ఉన్న మెంబర్స్ పని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడతారు అని చెప్పారు. అయితే శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ కి ఈ విషయం తెలిసిన వారు వాళ్ళ పనుల బిజీగా ఉండడం వల్ల జోక్యం చేసుకోలేదు. కానీ జానీ మాస్టర్ కి కూడా పనులు ఉన్నాయి అయితే యూనియన్ మెంబర్స్ కి అన్యాయం జరగకూడదని ఆయన ప్రశ్నించారు. అయితే ఆ సాయంత్రానికి మేడ్చల్ సిఐ నుండి ఫోన్ రాగా, జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురు వెళ్లి సిఐని కలవగా, ఆ తర్వాత జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. చేయని నేరానికి 14 రోజులు రిమాండ్ చేసి వచ్చారు. దీని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ యూనియన్ గొడవ లేంటో , ఆ గొడవల్లో జానీ మాస్టర్ ను ఇరికించడం ఏంటో అన్ని పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×