E-Paper
Advertisement

New Smartphone: కొత్త ఫోన్ లాంచ్.. రూ.10,000 లకే పొందొచ్చు, ఫీచర్లు బాగున్నాయ్!

New Smartphone: కొత్త ఫోన్ లాంచ్.. రూ.10,000 లకే పొందొచ్చు, ఫీచర్లు బాగున్నాయ్!
Advertisement

Lava Blaze 3 5G Launched: దేశీయ మార్కెట్‌లో వరుస ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. మొబైల్ కొనేవారు విపరీతంగా పెరిగిపోవడంతో డిమాండ్‌ కూడా పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త కంపెనీలు సైతం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అదే సమయంలో ఎంతో కాలంగా హవా చూపిస్తున్న కంపెనీలు సైతం మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు రకరకాల మోడల్స్ తీసుకొచ్చి అదరగొడుతున్నాయి. అందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ లావా ఒకటి.

దేశీయ మార్కెట్‌లో లావా తనదైన ముద్ర వేసుకుంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరలో ఫోన్లను లాంచ్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇప్పటికి ఎన్నో మొబైళ్లను తక్కువ ధరలో అందించి ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఇప్పుడు లావా తన లైనప్‌లో ఉన్న మరో మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ Lava Blaze 3 5Gని తాజాగా విడుదల చేసింది.

Advertisement

ఈ మొబైల్ 6.56 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 50 MP వెనుక కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇక ఇందులో 18 వాట్ల ఛార్జింగ్‌కు మద్దతుతో 5000 mAh బ్యాటరీని అందించారు.

Lava Blaze 3 5G Specifications

Advertisement

Lava Blaze 3 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ సరికొత్త బడ్జెట్ 5G మొబైల్‌గా అందుబాటులోకి వచ్చింది. 6.56 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600 × 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వచ్చింది. అదే సమయంలో 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. Lava Blaze 3 5G ఫోన్ MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. దీనికి 6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.

Also Read: హెచ్‌ఎండీ నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్, ధర ఎంతంటే?

అదే సమయంలో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు. ఇందులో డ్యూయల్ సిమ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త Lava ఫోన్‌లో 50 MP ప్రధాన కెమెరా అందించారు. ఇది LED ఫ్లాష్, 2 MP సెకండరీ AI కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్‌లో 8 MP ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే ఫోన్ సామర్థ్యం కోసం 18 వాట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

Lava Blaze 3 5G Price in India

Lava Blaze 3 5G ధర విషయానికొస్తే.. దీని 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.11,499గా కంపెనీ నిర్ణయించింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆ బ్యాంక్ తగ్గింపులతో ఈ ఫోన్‌ను కేవలం రూ.10,000లకే సొంతం చేసుకోవచ్చు. దీనిని లావా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 18 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇది గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×