E-Paper
Advertisement

Realme P4 Power 5G Launch: వారానికి రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలు.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ P4 పవర్ లాంచ్!

Realme P4 Power 5G Launch: వారానికి రెండుసార్లు ఛార్జ్ చేస్తే చాలు.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ P4 పవర్ లాంచ్!
Advertisement

Realme P4 Power 5G Launch: మునుపెన్నడూ లేని విధంగా ప్రముఖ చైనా సంస్థ రియల్‌మీ నుంచి ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో Realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో విడుదలైంది. మొబైల్ ప్రపంచంలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వచ్చిన ఈ ఫోన్.. ముఖ్యంగా ఛార్జింగ్ సమస్యలతో ఇబ్బంది పడేవారి కోసమే దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ రియల్‌మీ P4 పవర్ 5G ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారీ బ్యాటరీతో సంచలనం:

Realme P4 Power 5G ఫోన్ మెయిన్ హైలైట్ దాని 10,001mAh సిలికాన్ కార్బన్ టైటాన్ బ్యాటరీ. ‘వారానికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు’ అనే సరికొత్త ఫిలాసఫీతో వచ్చిన ఈ ఫోన్.. సాధారణ వినియోగదారులకు మాత్రమే కాదు.. రాత్రింబవళ్లు గేమ్స్ ఆడేవారికి, ట్రావెలర్స్‌కు పక్కా సెట్ అవుతుంది. దీనిలో భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఇది కేవలం 9.08mm మందం, 219 గ్రాముల బరువుతో ఉండటం విశేషం. దీనికి తోడు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వాడుతూ మరో ఫోన్‌ను 27W స్పీడ్‌తో ఛార్జ్ చేయొచ్చు.

Advertisement

Also Read: శాంసంగ్ కొత్త ‘సీక్రెట్ ఫీచర్’.. మీ పర్సనల్ చాట్స్ ఇక సేఫ్, ఎవరికీ కనిపించవు!

అద్భుతమైన డిస్‌ప్లే:

ఇక పర్ఫార్మెన్స్ విషయంలోనూ రియల్‌మీ ఎక్కడా తగ్గలేదు. దీనిలో వాడిన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, గేమింగ్ ప్రియులకు 90fps వరకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇక 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, ఏకంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. అలాగే కళ్లపై ఒత్తిడి పడకుండా 144Hz రిఫ్రెష్ రేట్, ఐకేర్ టెక్నాలజీని ఈ ఫోన్‌లో జోడించారు.

లాంచ్ ఆఫర్ల వివరాలు:

Advertisement

ముఖ్యంగా సామాన్యులను దృష్టిలో ఉంచుకుని రియల్‌మీ దీనిని బడ్జెట్ ధరలోనే ప్రవేశపెట్టింది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.25,999 ఉండగా.. 8GB + 256GB వేరియంట్ ధర రూ.27,999
గా నిర్ణయించారు. అలాగే 12GB + 256GB వేరియంట్ ధర రూ.30,999గా లిస్ట్ అయ్యింది. అయితే, లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్ల ద్వారా దీనిని కేవలం రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ అనే మూడు ఫ్యూచరిస్టిక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.

అందుబాటులోకి ఎప్పుడు?

Realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఫిబ్రవరి 5న ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లో కొనుగోలు చేసిన వారికి బ్యాటరీపై ఏకంగా నాలుగేళ్ల వారంటీని ఫ్రీగా అందిస్తున్నారు. వీటితో పాటు EMI ఆప్షన్లు, పాత మొబైల్ ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP66, IP68, IP69 రేటింగ్స్‌ను కలిగి ఉంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ ధరలు, ఫీచర్లు లీక్.. యాపిల్‌కు గట్టి పోటీ తప్పదా?

 

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×