Royal Enfield Bullet vs BSA Goldstar Comparison: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, BSA గోల్డ్ స్టార్ 650 పవర్ ఫుల్ ఇంజిన్ తో పాటు రెట్రో స్టైల్ లో ఆకట్టుకుంటుంది. రెండూ రెట్రో స్టైల్ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. బుల్లెట్, క్లాసిక్ 650 రిలాక్స్డ్, రిఫైన్డ్ క్రూజింగ్ కోసం రూపొందించిన 648cc పారలల్ ట్విన్ ను కలిగి ఉంది. BSA గోల్డ్ స్టార్ 652cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది టార్కియర్, మరింత ట్రెడిషనల్, పంచ్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
⦿ ఇంజిన్, పనితీరు: రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ సున్నితమైన అనుభూతిని అందిస్తుంది. సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. BSA సింగిల్ సిలిండర్ మరింత చురుగ్గా ఉంటుంది. తక్కువ RPM దగ్గర ఎక్కువ టార్క్ అంటే, 4,000 rpm దగ్గర 55 Nm టార్క్ ను అందిస్తుంది.
⦿ ట్రాన్స్ మిషన్: బుల్లెట్ 650 6 స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. గోల్డ్ స్టార్ 5 స్పీడ్ గేర్ బాక్స్ యూనిట్‌ను కలిగి ఉంటుంది.
⦿ ఫ్యూయెల్ ట్యాంక్: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 14 లేదంటే 15 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. BSA గోల్డ్ స్టార్ 650 12 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది.
⦿ బరువు: BSA 213 కిలోల బరువుతో తేలికగా ఉంటుంది. అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ 650 కామన్ గానే బరువుతుగా ఉంటుంది. ఇది మరింత ఎత్తుగా అనిపిస్తుంది. గోల్డ్ స్టార్ 780 మిమీ తక్కువ సీటు ఎత్తును కలిగి ఉంది.
⦿ డిజైన్, ఫీచర్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, BSA గోల్డ్ స్టార్ 650 వైర్ స్పోక్ వీల్స్, రెట్రో స్టైలింగ్, డ్యూయల్ ఛానల్ ABS కలిగి ఉంటాయి. BSA తరచుగా మరింత మినిమలిస్ట్, క్లాసిక్ లుక్‌ను కలిగి ఉంటుంది. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ బ్లూటూత్ నావిగేషన్ లాంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది.
⦿ రైడ్ క్వాలిటీ: ఇక రైడ్ క్వాలిటీ విషయానికి వస్తే గోల్డ్ స్టార్ వెనుక సస్పెన్షన్ గుంతల రోడ్ల మీద కూడా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ సెటప్ సాధారణంగా మరింత స్టేబుల్ గా ఉంటుంది.
Read Also: ఫస్ట్ PM E-DRIVE సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ ట్రక్ వచ్చేసింది, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 మృదువైన ఇంజిన్, మెరుగైన సర్వీస్ నెట్ వర్క్, సుదూర సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ టార్క్, తేలికైన సింగిల్ సిలిండర్ క్లాసిక్ అనుభవాన్ని కోరుకునే రైడర్లకు BSA గోల్డ్ స్టార్ నచ్చుతుంది.
Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ బైక్, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?