E-Paper
Advertisement

Samsung Galaxy S26: శాంసంగ్ కొత్త ‘సీక్రెట్ ఫీచర్’.. మీ పర్సనల్ చాట్స్ ఇక సేఫ్, ఎవరికీ కనిపించవు!

Samsung Galaxy S26: శాంసంగ్ కొత్త ‘సీక్రెట్ ఫీచర్’.. మీ పర్సనల్ చాట్స్ ఇక సేఫ్, ఎవరికీ కనిపించవు!
Advertisement

Samsung Galaxy S26: అత్యాధునిక ఫీచర్లతో.. ఫుల్ ప్రైవసీ అందించే ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ గురించి ఆసక్తికరమైన నెట్టింట వైరల్ అవుతోంది. ప్రయాణాల్లోనో, ఆఫీసులోనే ఫోన్ వాడుతున్నప్పుడు పక్కనోళ్లు మన ఫోన్‌లోకి తొంగి చూడటం చిరాకు తెప్పిస్తుంటుంది. ఇప్పుడీ సమస్యకు చెక్ పెడుతూ శాంసంగ్ ‘ప్రైవసీ డిస్‌ప్లే’ ఫీచర్‌ను తీసుకురాబోతుంది. తాజా లీక్స్ ప్రకారం.. త్వరలో విడుదల కాబోతున్న గెలాక్సీ ఫోన్లలో ఈ ఫీచర్ ఉంటుందని టెక్ నిపుణుల అంచనా.

కొత్తగా తీసుకు రాబోతున్న ఈ ఫీచర్‌ను ‘పిక్సెల్ లెవల్ ప్రైవసీ’ అని చెబుతోంది శాంసంగ్. అంటే.. ఇది కేవలం ఏదో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాత్రమే కాదు, డిస్‌ప్లే హార్డ్‌వేర్‌లోనే చేసిన అద్భుతం. దీని వెనుక ఫ్లెక్స్ మ్యాజిక్ పిక్సెల్ అనే కొత్త తరహా OLED టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది.

Advertisement

Also Read: వాట్సాప్‌లో కొత్త ‘లాక్‌డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్‌లో పడ్డట్టే!

మీరు ఫోన్‌ను నేరుగా చూస్తున్నప్పుడు స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఎవరైనా సైడ్ యాంగిల్ నుండి చూడాలని ప్రయత్నిస్తే.. వారికి స్క్రీన్ చీకటి కనిపిస్తుంది. దీనికోసం శాంసంగ్ ఇంజనీర్లు గత ఐదేళ్లుగా కష్టపడి ఈ టెక్నాలజీని సిద్ధం చేసినట్లు సమాచారం.

Advertisement

శాంసంగ్ ఈ ఫీచర్‌లో యూజర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తోంది. ఈ ప్రైవసీ మోడ్ ఎప్పుడు ఆన్ అవ్వాలి అనేది యూజరే నిర్ణయించుకోవచ్చు. అంటే.. మీరు ఏదైనా పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు లేదా బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు మాత్రమే ఇది ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

అయితే గతంలో ఈ ఫీచర్‌కు AI సాయం ఉంటుందని ప్రచారం జరిగినా.. శాం‌సంగ్ మాత్రం యూజర్ కస్టమైజేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి.. మీ పక్కన కూర్చున్న అపరిచితుల చూపుల నుండి మీ పర్సనల్ చాట్స్, ఫొటోలను కాపాడుకోవడానికి శాం‌సంగ్ తెస్తున్న ఈ ఫీచర్ నిజంగా గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 13పై ఊహించని డిస్కౌంట్, స్టాక్ అయిపోయేలోపు కొనేయండి!

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×