E-Paper
Advertisement

రియల్‌మీ కొత్త ఫోన్.. 8000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, AI కెమెరా.. మార్కెట్ షేక్ అవ్వాల్సిందే!

రియల్‌మీ కొత్త ఫోన్.. 8000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, AI కెమెరా.. మార్కెట్ షేక్ అవ్వాల్సిందే!

Realme P4R 5G: చైనీస్ టెక్ దిగ్గజం రియల్ మీ.. బడ్జెట్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ‘Realme P4R 5G’ పేరుతో బుధవారం (జూన్ 10) భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఏకంగా 8,000 mAh భారీ బ్యాటరీతో తీసుకురావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపై పడింది. పైగా దీనిలోకి అద్భుత ఫీచర్లు.. మెుబైల్ ప్రియులకు తప్పకుండా ఆకట్టుకుంటాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కు సంబంధించి ప్రధాన ఫీచర్లు, ధర వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాటరీ కాదు.. పవర్‌ హౌస్!

Realme P4R 5G ఫోన్ లో ప్రధాన హైలైట్ బ్యాటరీ నిలుస్తోంది. 8,000 mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.88 మి.మీ మాత్రమే ఉండటం విశేషం. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఫోన్ కు అందించారు.

డిస్‌ప్లే అదుర్స్.. గేమింగ్‌కు కేరాఫ్

రియల్‌మీ P4R 5G ఫోన్.. 6.8 అంగుళాల సన్‌లైట్ ఎల్ సీడీ డిస్‌ప్లేతో రూపొందింది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉండటం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కారణంగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నాయి.

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) ప్రాసెసర్‌తో పనిచేయనుంది. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్‌ను కూడా ఇది ఎంతో తేలిగ్గా చేసేయగలదు. మరోవైపు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో 5300mm² ఎయిర్‌ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0తో నడిచే ఈ ఫోన్‌కు 2 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను రియల్ మీ ఆపర్ చేస్తోంది.

50MP ఏఐ కెమెరా

ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ఏఐ (AI) ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ను అందించారు. ఇందులో ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ అన్‌బ్లర్, ఏఐ అల్ట్రా క్లారిటీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్

ఈ ఫోన్‌ను చాలా ధృడంగా డిజైన్ చేసినట్లు రియల్ మీ తెలిపింది. దీనికి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్నట్లు పేర్కొంది. కాబట్టి ఫోన్ ప్రమాదవశాత్తు కిందపాడిన త్వరగా పాడవ్వదని చెప్పుకొచ్చింది. మరోవైపు దుమ్ము, నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం IP65 రేటింగ్ ను ఈ ఫోన్ కు అందించారు. 400% అల్ట్రా వాల్యూమ్ ఇచ్చే సూపర్ లీనియర్ స్పీకర్లు సైతం ఇందులో ఉన్నాయి.

Also Read: పీఓకేలో తీవ్ర విషాదం.. కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. 21 మంది సైనికులు మృతి!

ఇంతకీ ధర ఎంతంటే?

Realme P4R 5G ఫోన్ ప్రారంభ ధరను రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. అలాగే రియల్ మీ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని కంపెనీ వర్గాలు సూచించాయి. లాంచ్ ఆఫర్ కింద రూ.2000 డిస్కౌంట్ సైతం అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 3 నెలల నో కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

Also Read: ఫోన్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయకపోతే.. సర్వస్వం ఊడ్చేస్తారు!

Related News

జులైలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు..టెక్ లవర్స్‌కు పండగే!

ఫోన్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయకపోతే.. సర్వస్వం ఊడ్చేస్తారు!

ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. ఈ 5 యాప్స్ ఉంటే చాలు!

కాలేజ్ విద్యార్థుల కోసం.. అత్యుత్తమ విండోస్ ల్యాప్‌టాప్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంకులతో నో టెన్షన్.. ఫాస్ట్ ఛార్జింగ్ గ్యారెంటీ!

స్టూడెంట్స్ స్పెషల్.. రూ.15 వేల బడ్జెట్లో.. అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇవే!

ఆఫీస్ vs వర్క్ ఫ్రమ్ హోమ్.. డబ్బు ఆదాకు ఏది బెస్ట్? ChatGPT షాకింగ్ రిపోర్ట్!

×