E-Paper
Advertisement

పీఓకేలో తీవ్ర విషాదం.. కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. 21 మంది సైనికులు మృతి!

పీఓకేలో తీవ్ర విషాదం.. కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. 21 మంది సైనికులు మృతి!
Advertisement

Pak Helicopter Crash: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న పైలట్లతో సహా అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ముజఫరాబాద్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తగా.. పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ దుర్ఘటనపై పాక్ అధ్యక్షుడు ఆసిప్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన సైనిక సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ సైతం ప్రాణ నష్టంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Advertisement

అయితే పీవోకే పరిధిలోని ముజఫరాబాద్, మీర్ పూర్ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. నిత్యవసర ధరలు ఆకాశానికి తాకడంతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు రోడ్డెక్కారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగడంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.

Advertisement

Also Read: ఫోన్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయకపోతే.. సర్వస్వం ఊడ్చేస్తారు!

దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు నేరుగా పాక్ సైన్యమే రంగంలోకి దిగింది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపేందుకు భారీ ఎత్తున బలగాలను పీఓకేలోని ముజఫరాబాద్ తో పాటు తదితర ప్రాంతాలకు పంపింది. ఈ క్రమంలోనే సైనికులు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కుప్పకూలడం గమనార్హం. అయితే పరిమితికి మించి సైనికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

Also Read: స్టూడెంట్స్ స్పెషల్.. రూ.15 వేల బడ్జెట్లో.. అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇవే!

Related News

Indian Sailors: ఒమన్‌ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి!

అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. ఆపై రూ. 950 కోట్లు, భారత సంతతి వ్యాపారి అరెస్- డ్రగ్స్ ఆపై అమ్మాయిల ఎర

హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా సీక్రెట్ ఆపరేషన్..గుట్టు బయటపెట్టిన ట్రంప్, ఇదీ అసలు మేటర్

ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్, మళ్లీ ప్రపంచ దేశాలు చమురు కష్టాలు

రణరంగంగా మారిన నగరాలు.. పాక్ సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి, 200 మందికి పైగానే

మళ్లీ యుద్ధం మొదలు.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత

హోర్మూజ్ జలసంధి దగ్గర.. కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌, పైలట్లు సేఫ్

Big Stories

Advertisement
×