E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మీ P4x vs గెలాక్సీ A17 vs వివో Y31.. ఏ ఫోన్ కొనాలి?

Smartphone Comparison: రియల్‌మీ P4x vs గెలాక్సీ A17 vs వివో Y31.. ఏ ఫోన్ కొనాలి?
Advertisement

Realme P4x vs Samsung Galaxy A17 vs Vivo Y31 Smartphone Comparison| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ భారత్‌లో ఇటీవలే రియల్‌మీ P4x 5G మోడల్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ A17 5G, వివో Y31 5G మార్కెట్లో ఉన్నాయి. మూడు ఫోన్లూ బడ్జెట్ యూజర్లపై ఫోకస్ చేస్తున్నాయి. పర్‌ఫామెన్స్, బ్యాటరీ లైఫ్, వాల్యూ ధరలపై దృష్టి పెట్టాయి.

ధరల పోలిక

రియల్‌మీ P4x 5Gలో అనేక స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499, 8GB ర్యామ్ + 128GB వేరియంట్ రూ.16,999, 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.17,999.
శాంసంగ్ గెలాక్సీ A17 5G తక్కువ ధర నుంచి ప్రారంభమవుతుంది. 4GB ర్యామ్ + 128GB వేరియంట్ రూ.13,999, 6GB ర్యామ్ + 128GB వేరియంట్ రూ.15,499.
వివో Y31 5G – 4GB ర్యామ్+ 128GB వేరియంట్ ధర రూ.14,999, మరో వేరియంట్ ధర రూ.16,499.
ధర పరంగా మూడు ఫోన్లు కూడా స్వల్ప తేడాతో ఉన్నాయి. అయితే రియల్‌మీ ఎక్కువ వేరియంట్లు అందిస్తోంది.

డిస్‌ప్లే క్వాలిటి

Advertisement

రియల్‌మీ P4x 5Gలో 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. 1080 x 2400 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్. శాంసంగ్ గెలాక్సీ A17 5Gలో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, వైబ్రంట్ కలర్స్‌తో 90Hz రిఫ్రెష్ రేట్. వివో Y31 5Gలో 6.68 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

రియల్‌మీ P4x 5Gలో 7000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.
శాంసంగ్ గెలాక్సీ A17 5Gలో 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్.
వివో Y31 5Gలో 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్.

సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

రియల్‌మీ P4x 5G ఆండ్రాయిడ్ 15తో రియల్‌మీ UI 6.0తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A17 5G ఆండ్రాయిడ్ 15తో వన్ UI 7తో ఉంటుంది. వివో Y31 5G ఆండ్రాయిడ్ 15తో ఫన్‌టచ్ OS 15తో వస్తుంది. మూడు ఫోన్లు అడ్వాన్స్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

రియల్‌మీ P4x 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు, గేమింగ్‌కు బలమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A17 5Gలో ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ఎఫిషియెన్సీ, స్టేబుల్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. వివో Y31 5Gలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ రోజువారీ వినియోగానికి బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది.

కెమెరా సెటప్

రియల్‌మీ P4x 5Gలో 50MP ప్రైమరీ + 2MP సెకండరీ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.
శాంసంగ్ గెలాక్సీ A17 5Gలో 50MP మెయిన్ (ఆటోఫోకస్‌తో) + 2MP మాక్రో, 13MP ఫ్రంట్ కెమెరా.
వివో Y31 5Gలో 50MP ప్రైమరీ + లో-రిజల్యూషన్ సెకండరీ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా.

Also Read: కేవలం రూ.44కే ఒక సంవత్సరం వాలిడిటీ.. జియో సిమ్ యూజర్లకు మాత్రమే ఈ ట్రిక్

కనెక్టివిటీ ఫీచర్స్

రియల్‌మీ P4x 5Gలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C. శాంసంగ్ గెలాక్సీ A17 5Gలో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, USB టైప్-C. వివో Y31 5Gలో 5G, Wi-Fi, బ్లూటూత్ 4.2, USB టైప్-C (USB 2.0).

ఫైనల్ విన్నర్

బెస్ట్ బ్యాటరీ, డిస్‌ప్లే పర్‌ఫామెన్స్ కోసం రియల్‌మీ P4x 5G బెటర్ ఆప్షన్. శాంసంగ్ గెలాక్సీ A17 5G ప్రీమియం AMOLED డిస్‌ప్లే ఇస్తుంది. వివో Y31 5G బ్యాటరీ సైజ్, ఫాస్ట్ ఛార్జింగ్‌లో బ్యాలెన్స్ ఇస్తుంది. మొత్తంగా చూస్తే ధర, ఫీచర్ల పరంగా రియల్ మీ స్వల్ఫ ఆధిక్యంలో ఉంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

Big Stories

Advertisement
×