Railway Station Parking: కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 400 బైక్ లు దగ్ధమయ్యాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు వందలాది వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం
ఆదివారం ఉదయం త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. ఈ విషయాన్ని అగ్నిమాపక అధికారులు తెలిపారు. పెయిడ్-పార్కింగ్ షెడ్‌లో ఉదయం 6.30 గంటలకు మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పావు గంటల తర్వాత ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందింది.
ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై విద్యుత్ తీగల నుంచి నిప్పురవ్వ పడి మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనలో షెడ్‌లోవున్న 400 టూ వీలర్స్ వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం అగ్నికి ఆహుతి అయ్యాయి. మూడు అగ్నిమాపక బృందాలు 7.45 గంటల ప్రాంతంలో రంగంలోకి దిగాయి.
దాదాపు 400 బైక్‌లు దగ్దం, ఘటన ఎలా జరిగింది?
రెండు గంటల తర్వాత మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు. అయితే మంటలు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. కేవలం ద్విచక్ర వాహనాలు కాకుండా టిన్ షీట్లతో కప్పబడిన షెడ్ మొత్తం మంటల్లో దెబ్బతిన్నట్లు అధికారి చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.
అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ సంఘటనకు సంబంధించి వెంటనే నివేదిక సమర్పించాలని త్రిస్సూర్ సిటీ పోలీసు కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందాన్ని నియమిస్తామని తెలిపారు.
ALSO READ: ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి
మరోవైపు అగ్నిప్రమాదం ఘటనపై కేంద్రమంత్రి సురేష్ గోపి.. సీనియర్ రైల్వే అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్-DRM స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటన అత్యంత తీవ్రంగా పరిగణించినట్టు తెలిపారు.
మంటలు అదుపులో వచ్చినప్పటికీ పార్కింగ్ షెడ్ పూర్తిగా దగ్ధమైంది. మంటల తీవ్రతకు టిన్-షీట్ పైకప్పు నిర్మాణం కూలిపోయింది. ప్లాట్‌ఫారమ్‌కు దగ్గరగా పార్కింగ్ స్థలం ఉంది. ఘటన సమయంలో ప్యాసింజర్ రైళ్లు అటువైపు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. మంటలు రైలు ఇంజిన్‌కు వ్యాపించాయనే వార్తలను రైల్వే అధికారులు తోసిపుచ్చారు.
భారీ అగ్ని ప్రమాదం.. దాదాపు 400 బైక్ లు దగ్ధం
కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఘటన
విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పు రవ్వల వల్ల మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్న అధికారులు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడి pic.twitter.com/Vo1Is8eZ3z
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2026