E-Paper
Advertisement

Bhogapuram Airport: ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్

Bhogapuram Airport: ఏపీకి గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్
Advertisement

Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు హ్యాపీగా ఫీలయ్యారు. ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలిసారి విమానం ల్యాండింగ్

Advertisement

ఏపీ విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వలసల ప్రాంతంగా పేరు పొందిన ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్టు రెడీ కావడంతో బూస్ట్ లభించిన ట్టయ్యింది. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం తొలి విమానం సేఫ్‌‌గా ల్యాండ్ అయ్యింది.  టెర్మినల్ దగ్గరలో ల్యాండైంది ఎయిరిండియా విమానం. అనుకున్న సమయానికి విమానం వచ్చింది.

Advertisement

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్, పలువురు సివిల్ ఏవియేషన్ అధికారులు అందులో వచ్చారు. అందుకుముందు విమానం ల్యాండింగ్‌కు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎయిర్‌పోర్టుని నిర్మించింది జీఎంఆర్ సంస్థ.  ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సాంకేతిక అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు రాక 

హుద్‌హుద్ వంటి తుపాన్లను తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు అధికారులు. గతంలో ఇచ్చిన గడువు కంటే ఆరునెలలు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఎయిర్‌పోర్టు రెడీ కావడంతో ఆ ప్రాంతంలో పెట్టుబడులు, పర్యాటక రంగం మరింత ఊపందుకోనుంది.

విమానం ల్యాండింగ్ సేఫ్‌‌గా జరగడంతో ఎప్పుడు ఎయిర్‌పోర్టుని ప్రారంభించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ ప్రకారం జూన్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేవలం ఐదు శాతం మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రాబోయే ఐదు నెలల్లో అవన్నీ పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. 2,200 ఎకరాల్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. రోజుకు 200 నుంచి 300 విమానాలు  ల్యాండింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ALSO READ: అనకాపల్లి జిల్లా ఎస్వీఎస్ కెమికల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయిన ఘట్టాన్ని చూసేందుకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, అదితి గజపతిరాజు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, విజనయనగరం జిల్లా కలెక్టర్ రాం సుందర్‌రెడ్డి హాజరయ్యారు.

 

 

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×