E-Paper
Advertisement

Realme Phones Discount: రియల్‌మీ స్పెషల్ సేల్.. బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్

Realme Phones Discount: రియల్‌మీ స్పెషల్ సేల్.. బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్
Advertisement

Realme Popular Phones Discount| రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇండియాలో కొత్త సేల్‌ ప్రారంభించింది. ఈ సేల్‌లో బెస్ట్ సెల్లర్ స్మార్ట్‌ఫోన్లపై గణనీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక సేల్‌లో కొన్ని సెలెక్ట్‌డ్ మోడల్స్ పై రూ.6,000 వరకు ధర తగ్గింపు ఉంది. చేయవచ్చు. ఈ ఆఫర్లు వివిధ సెగ్మెంట్ విభాగాల్లో మంచి వాల్యూ ఫర్ మనీ అందిస్తున్నాయి. మొత్తం ఎనిమిది స్మార్ట్‌ఫోన్లు ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి.

రియల్‌మీ పవర్‌ఫుల్ సేల్ ప్రారంభం

రియల్‌మీ బడ్జెట్ కస్టమర్లు నుంచి ప్రీమియం కొనుగోలుదారుల వరకు అందరి కోసం ఈ సేల్‌ను తీసుకొచ్చింది. ఆఫర్లలో డైరెక్ట్ ధర తగ్గింపులు, బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా పాపులర్ రియల్‌మీ ఫోన్లు ఇప్పుడు ముందుకంటే చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ సేల్ వల్ల ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ ఫోన్లు మరింత అందుబాటు ధరలో లభిస్తున్నాయి.

Realme GT 7 Pro – ప్రీమియం ఫోన్ మరింత చీప్

Advertisement

రియల్‌మీ GT 7 ప్రో బ్రాండ్‌లో అత్యంత పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్‌పై రూ.1,000 అధికారిక ధర తగ్గింపు ఉంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.49,999కు లభిస్తోంది. ముందు ఇదే వేరియంట్ ధర రూ.50,999 ఉండేది. ఈ ఆఫర్ వల్ల ప్రీమియం డివైస్ మరింత ఆకర్షణీయంగా మారింది.

Realme GT 7 – రూ.6,000 డిస్కౌంట్

రియల్‌మీ GT 7 లిస్టెడ్ ధర రూ.39,999. ఈ ఫోన్‌పై రూ.3,000 డైరెక్ట్ ధర తగ్గింపు ఉంది. అదనంగా రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మొత్తం రూ.6,000 డిస్కౌంట్ వచ్చి, 8GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.33,999కు దొరుకుతోంది.

Realme GT 7T – బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్

Advertisement

రియల్‌మీ 7Tకి రూ.4,000 స్ట్రెయిట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఒరిజినల్ ధర రూ.34,999 ఉండగా, ఆఫర్ తర్వాత కేవలం రూ.30,999కు కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 80 Pro – సరసమైన మిడ్-రేంజ్ డీల్

రియల్‌మీ నార్జో 80 ప్రోకు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. లాంచ్ సమయంలో దీని ధర రూ.17,999 ఉండగా, ఇప్పుడు రూ.16,999కు లభిస్తోంది. ఈ డివైస్‌లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి.

Realme Narzo 80 Lite 5G – బడ్జెట్ 5G ఫోన్ మరింత చీప్

ఈ ఫోన్‌పై రూ.1,000 కూపన్ డిస్కౌంట్ ఉంది. బేస్ వేరియంట్‌లో 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఉన్నాయి. డిస్కౌంట్ తర్వాత ధర రూ.10,999కు పడిపోయింది. ఈ డీల్ ఎంట్రీ-లెవల్ 5G కస్టమర్ల కోసం మంచి అవకాశం.

Realme Narzo 80 Lite 4G – అతి తక్కువ ధర మోడల్

రియల్‌మీ నార్జో 80 లైట్ 4G వర్షన్‌కు కూడా కూపన్ డిస్కౌంట్ ఉంది. కూపన్ ఉపయోగించి రూ.300 తగ్గింపు పొందవచ్చు. బేస్ వేరియంట్‌లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉన్నాయి. ఫైనల్ ధర రూ.8,199 మాత్రమే.

Also Read: రూ.15000లోపు ధరలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్స్.. లిస్ట్‌లో టాప్ ఇదే

Realme 90x – బడ్జెట్ పర్ఫార్మర్‌పై డిస్కౌంట్

రియల్‌మీ 90ఎక్స్‌కు రూ.500 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. ఎఫెక్టివ్ ధర రూ.13,499కు పడిపోయింది. ఈ ఫోన్‌లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. బడ్జెట్‌లో బ్యాలెన్స్‌డ్ పర్ఫార్మెన్స్ కావాల్సినవారికి సరిపోతుంది.

Realme 90 -బ్యాంక్ ఆఫర్‌తో సేవింగ్స్

రియల్‌మీ 90కు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. ఎఫెక్టివ్ ధర రూ.15,999 అవుతుంది. బేస్ వేరియంట్‌లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. రోజువారీ ఉపయోగం కోసం స్మార్ట్‌ఫోన్ కావాల్సినవారికి ఇది సరైన ఆప్షన్.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×